Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు మ‌ర‌మ్మ‌తు చేసిన నూజివీడు పోలీసులు

Webdunia
గురువారం, 29 జులై 2021 (16:13 IST)
ఎక్క‌డైనా యాక్సిడెంట్ జ‌రిగితే... పోలీసులు హుటాహుటిన వ‌స్తారు... ఏ వాహ‌నానిది త‌ప్పో ఎంచి కేసులు
రాసుకుంటారు. డ్రైవ‌ర్ల‌ను అరెస్టు చేస్తారు. ఇదీ పోలీసులు డ్యూటీ... మ‌హా అయితే, మాన‌వతా దృక్ప‌థంతో యాక్సిడెంట్లో క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లిస్తారు. 
 
కానీ నూజివీడు పోలీసులు మాత్రం మాన‌వ‌త్వంలో మ‌రో అడుగు ముందుకు వేశారు. యాక్సిడెంట్ జ‌రిగిన స్పాట్లో త‌మ విధుల‌న్నీ పూర్తి చేయ‌డ‌మే కాకుండా, తిరిగి అక్క‌డ యాక్సిడెంట్ జ‌ర‌గ‌కుండా... రోడ్డును కూడా మ‌ర‌మ్మ‌తు చేశారు.
 
కృష్ణాజిల్లా నూజివీడు రహదారిలో యాక్సిడెంట్ అయింది. 
 
ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు వేగంగా వచ్చి ఢీకొన్నాయి. ఆ ప్రమాదానికి సంబంధించి డ‌య‌ల్ 100 కు కాల్ రాగా, వెంటనే నూజివీడు ఎస్సై రామకృష్ణ సిబ్బందితో కలిసి ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అక్క‌డ గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. 
 
లోడుతో వెళ్తున్న లారీలోని సరుకు రహదారిపై అస్తవ్యస్తంగా పడడంతో, వెంటనే ఎస్ఐ, సిబ్బంది లారీలను పక్కకు జరిపి రహదారిపై ఉన్న వస్తువులను శుభ్రం చేయించారు. అంతేకాదు... ఇంకొకసారి ఆ ప్రాంతంలో ప్రమాదం జరగకూడదని ఏకంగా రోడ్డును మ‌ర‌మ్మ‌తు చేశారు. ప్ర‌మాదం జ‌రిగిన చోట‌ రేడియం స్టిక్కర్లు కలిగిన డ్రమ్ములను అమర్చారు. రోడ్డును పూర్తిగా వేసి, మ‌ర‌మ్మ‌తు పూర్త‌య్యాక ఈ డ్ర‌మ్ముల‌ను తొలగిస్తామ‌ని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments