Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదా గురించి చట్టంలో లేదు.. అందువల్ల, ఇవ్వలేం : జయంత్ సిన్హా

Webdunia
శనివారం, 7 మే 2016 (15:17 IST)
ఏపీ విభజన చట్టంలో ప్రత్యేక హోదా గురించి ఎక్కడా పేర్కొనలేదనీ, అందువల్ల దాన్ని ఇవ్వలేమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తేల్చి చెప్పారు. అంతేకాకుండా, విభజన చట్టంలో లేనిదే కాదు... ఉన్నదీ ఇవ్వలేమన్నారు. ఈ మేరకు ఆయన లిఖితపూర్వక సమాధానం కూడా ఇచ్చారు. ఇదే అంశంపై టీడీపీ ఎంపీలు కేశినేని నాని, ఎన్‌.శివప్రసాద్‌, అవంతి శ్రీనివాస్‌ అడిగిన వేర్వేరు ప్రశ్నలకు పైవిధంగా బదులిచ్చారు. 
 
'రాష్ట్రానికి ఎక్సైజ్‌ డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సర్కారు కోరింది. అయితే, ప్రాంతాల ఆధారంగా మినహాయింపులు ఇస్తే, దేశంలో ఆర్థిక వక్రీకరణ చోటుచేసుకుంటుంది. మినహాయింపులు లేని ప్రాంతంలోని పరిశ్రమలపై ప్రభావం పడుతుంది. మినహాయింపులు ఉన్న చోటికి పరిశ్రమలు తరలిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల... పన్ను ఆదాయం తగ్గిపోతుంది. జీడీపీలో పన్నుల నిష్పత్తి తగ్గుతుంది. ఇన్‌పుట్‌ డ్యూటీ క్రెడిట్‌ వ్యవస్థ దెబ్బతింటుంది. అందువల్ల, ఆంధ్రప్రదేశ్‌కు ఎక్సైజ్‌ డ్యూటీ మినహాయింపులు ఇవ్వటం లేదు' ఆయన స్పష్టం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments