Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొడవు కావాలని కాళ్లకు ఆపరేషన్.. నిఖిల్ రెడ్డి వాకర్ లేకుండా నడుస్తున్నాడోచ్..

పొడవు కావాలని కాళ్లకు ఆపరేషన్ చేయించుకొని, ప్రస్తుతం మంచానికే పరిమితమైన సాఫ్టువేర్ ఇంజినీర్ నిఖిల్ రెడ్డి నరకయాతన అనుభవించాడు. నిఖిల్ ఎత్తు పెంపు సర్జరీపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కూడా ఇటీవల స్పందించి

Webdunia
బుధవారం, 30 నవంబరు 2016 (09:00 IST)
పొడవు కావాలని కాళ్లకు ఆపరేషన్ చేయించుకొని, ప్రస్తుతం మంచానికే పరిమితమైన సాఫ్టువేర్ ఇంజినీర్ నిఖిల్ రెడ్డి నరకయాతన అనుభవించాడు. నిఖిల్ ఎత్తు పెంపు సర్జరీపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కూడా ఇటీవల స్పందించింది. సర్జరీ చేయడం సరికాదని, ఇది అనవసరమని, ఇందుకు బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. నిఖిల్ రెడ్డి ప్రస్తుతం బెడ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. 
 
కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ ఎం.ఎన్‌.రెడ్డినగర్‌కు చెందిన నిఖిల్‌రెడ్డికి ఏప్రిల్‌ 5న ఎముకల వైద్య నిపుణుడు చంద్రభూషణ్‌ శస్త్ర చికిత్స చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ వైద్య మండలి శస్త్ర చికిత్స చేసిన వైద్యుణ్ని రెండేళ్లపాటు వైద్య వృత్తి చేయకుండా గతంలో సస్పెండ్‌ చేశారు. 
 
ఈ నేపథ్యంలో గ్లోబల్‌ ఆసుపత్రిలో ఎత్తుపెంపు శస్త్రచికిత్స చేయించుకుని ఆర్నెల్లుగా మంచానికే పరిమితమైన నిఖిల్‌రెడ్డి క్రమంగా కోలుకుంటున్నాడు. రెండురోజులుగా వాకర్‌ సాయం లేకుండానే ఒక్కో అడుగు వేస్తున్నట్లు నిఖిల్‌రెడ్డి తండ్రి గోవర్దన్‌రెడ్డి తెలిపారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments