Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇష్టంలేని పెళ్లి చేశారనీ... కూరగాయల కత్తితో భర్త మెడ నరికిన భార్య...

ఇష్టం లేని పెళ్లి చేశారనీ కట్టుకున్న భర్త మెడను నిర్దాక్షిణ్యంగా నరికిందో కసాయి భార్య. పక్కా ప్రణాళికతో ఈ హత్యాయత్నానికి పాల్పడింది. అదీ కూడా పెళ్లయిన 20 రోజులకే. ఈ దారుణం శ్రీకాకుళం జిల్లా పలాసలో జరి

Webdunia
బుధవారం, 30 మే 2018 (14:28 IST)
ఇష్టం లేని పెళ్లి చేశారనీ కట్టుకున్న భర్త మెడను నిర్దాక్షిణ్యంగా నరికిందో కసాయి భార్య. పక్కా ప్రణాళికతో ఈ హత్యాయత్నానికి పాల్పడింది. అదీ కూడా పెళ్లయిన 20 రోజులకే. ఈ దారుణం శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగింది. జిల్లాలో సంచలనం సృష్టించిన భర్తపై నవవధువు హత్యాయత్నం కేసులో నిందితురాలు నీలిమను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో నిందితురాలు పూర్తి వివరాలను వెల్లడించింది.
 
తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించినా అందుకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. బలవంతంగా నవీన్‌కుమార్‌తో పెళ్లి చేయించారు. ఇష్టంలేకుండానే 20 రోజుల పాటు కాపురం చేశాను. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించాను. కానీ, తాను చావడం కన్నా భర్తను చంపేయడమే ఉత్తమమని భావించి భర్త నవీన్‌పై దాడిచేసినట్టు చెప్పింది. 
 
తన ప్రణాళికలో భాగంగా, సోమవారం సాయంత్రం భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వడ్డివాడ రైల్వే గేటు వద్ద ముందుగా తెచ్చుకున్న కూరగాయల కత్తితో నవీన్‌ మెడపై దాడిచేసినట్టు తెలిపింది. ఈ దాడితో తేరుకున్న నవీన్... కేకలు వేయగా సమీప పొలంలో పనులు చేస్తున్న రైతులు అక్కడకు చేరుకొని రక్తం కారుతున్న నవీన్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
తన ప్లాన్ విఫలం కావడంతో నీలిమ అక్కడ నుంచి  చాకచక్యంగా తప్పించుకుంది. ఆ తర్వాత పోలీసులు కాశీబుగ్గ, పాలకొండ, శ్రీకాకుళం సబ్‌ డివిజన్‌లలో షీటీమ్‌లను ఏర్పాటు చేసి నిందితురాలని పట్టుకున్నట్టు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి శ్రీకాకుళం కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి: నవ్వొచ్చినా.. ఏడుపొచ్చినా ఆపుకోలేదు..

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments