Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా అల్లుడు మాజీ ప్రియురాలితో పారిపోయాడు... కానీ అతడే కావాలి, అత్తమామల ఫిర్యాదు

వాడు మామూలోడు కాదు. వరసబెట్టి ఇద్దరమ్మాయిలను ప్రేమంటూ బుట్టలో పడేశాడు. ఒకరికి తెలియకుండా ఇంకొకరితో రొమాన్స్ చేస్తూ ఇద్దరినీ లోబరుచుకున్నాడు. మొదటి ప్రియురాలి కంటే రెండో ప్రియురాలు కాస్త వేగం పుంజుకుని పెళ్లి ప్రపోజల్ పెట్టింది. విషయాన్ని తల్లిదండ్రుల

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2017 (19:04 IST)
వాడు మామూలోడు కాదు. వరసబెట్టి ఇద్దరమ్మాయిలను ప్రేమంటూ బుట్టలో పడేశాడు. ఒకరికి తెలియకుండా ఇంకొకరితో రొమాన్స్ చేస్తూ ఇద్దరినీ లోబరుచుకున్నాడు. మొదటి ప్రియురాలి కంటే రెండో ప్రియురాలు కాస్త వేగం పుంజుకుని పెళ్లి ప్రపోజల్ పెట్టింది. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కూడా పెద్దమనసుతో అంగీకరించారు. దీనితో ఇద్దరికీ జూన్ నెల 2న వివాహం చేశారు. ఐతే అతడికి మళ్లీ మొదటి ప్రియురాలు గుర్తొచ్చింది. అంతే ఆమెతో చెక్కేశాడు. 
 
వివరాల్లోకి వెళితే... తాడేపల్లి పరిధిలోని కుంచనపల్లి గ్రామంలో ఓ యువకుడు పొరుగింటి అమ్మాయిని ప్రేమించాడు. ఇంతలో ఇటీవలే గుంటూరు నుంచి ఓ కుటుంబం వలస వచ్చింది. ఆ కుటుంబంలోని అమ్మాయిని కూడా ప్రేమించాడు. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇద్దరితోనూ రొమాన్స్ సాగించాడు. 
 
రెండో ప్రియురాలు పెళ్లి అంటూ అతడికి కండిషన్ పెట్టడంతో పెద్దల అంగీకారంతో ఆమెను మనువాడాడు. జూన్ 2న పెళ్లయింది. ఐతే పెళ్లయి వారం రోజులు కూడా గడవక ముందే చెప్పా పెట్టకుండా పారిపోయాడు. ఎక్కడికెళ్లాడని ఆరా తీస్తే మొదటి ప్రేమికురాలిని తీసుకుని వెళ్లిపోయినట్లు కనుగొన్నారు. దీనితో అతడి భార్య(రెండో ప్రియురాలు) తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలనీ, కేసులేమీ పెట్టబోమనీ, తమ అల్లుడిని తమకు అప్పగిస్తే చాలని కోరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments