Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివ్యను వాడుకుని చంపేశాడా? నాగేంద్ర బాబుపై ఆరా!!

Webdunia
ఆదివారం, 18 అక్టోబరు 2020 (17:30 IST)
విజయవాడకు చెందిన బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్వని హత్య కేసులోని మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. తామిద్దరం ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలోనే భాగంగా ఎవరి గొంతు వాళ్లు కోసుకున్నామని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన దివ్య ప్రియుడు నాగేంద్ర.. ఆ తర్వాత నాగేంద్రకు, దివ్యకు మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. పైగా, ఈ ఆడియోలో నాగేంద్రను దివ్య తిడుతూ కనిపించింది. ఫలితంగా ఈ కేసులో ఏదో మిస్టరీ దాగివుందనే కోణంలో పోలీసులు అనుమానిస్తూ, ఆ మిస్టరీని ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు. 
 
ముఖ్యంగా, ఈ కేసులో నిందితుడు నాగేంద్రబ చెప్పినదానికి, దివ్య తేజస్విని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోకి వ్యత్యాసం ఉండటంతో.. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో నాగేంద్రబాబు టార్చర్‌పై దివ్య తేజస్విని ఆవేదన వ్యక్తం చేయడంతో కేసు కొత్త మలుపు తీసుకుంది. దీంతో దివ్యతేజస్వినికి క్లోజ్‌గా ఉండే ఫ్రెండ్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఫాలోవర్స్ ద్వారా పలు వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. 
 
దివ్యతేజస్విని, నాగేంద్రబాబు మధ్య తలెత్తిన విభేదాల అనంతరం నాగేంద్రబాబుతో దివ్య ఫ్రెండ్స్ ఎవరెవరు బాగా సన్నిహితంగా మెలిగారన్న దానిపై పోలీసులు దృష్టి పెట్టారు. హత్య జరిగిన ప్రదేశంలో నాగేంద్రబాబుతో పాటు అతని స్నేహితులు ఇంకెవరైనా ఉన్నారా..? అన్న కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments