Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వైద్యారోగ్య శాఖలో 14,200 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (14:22 IST)
ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో నమోదైన డెంగ్యూ కేసుల్లో సగం విశాఖ జిల్లాలోనే నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ కమిషనర్ భాస్కర్ తెలిపారు. వైద్యారోగ్య శాఖపై సీఎం జగన్ జ‌రిపిన సమీక్షలో ఈ వివ‌రాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో ఔషధాల కొరత లేదని, కరోనా దృష్ట్యా ఐదారు రెట్ల ఔషధాలను కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నామని భాస్కర్ పేర్కొన్నారు.
 
వైద్యారోగ్య శాఖలో 14,200 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని భాస్కర్ తెలిపారు. డాక్టర్లు, నర్సులు, ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ-ఔషది వెబ్‌సైట్‌లో ఎక్కడా సమస్యలు లేవన్నారు. సబ్‌సెంటర్ స్థాయి వరకు టెలిమెడిసిన్ సేవలు తీసుకెళ్లామన్నారు. ఔషధాల వినియోగంలో అత్యవసర పరిస్థితిని అనుసరించి కేటాయింపులు చేసామన్నారు. క్యాన్సర్ చికిత్సలో వాడే మందులు అవసరం కంటే ఎక్కువే ఉన్నాయని ఆయన తెలిపారు. డెంగ్యూలో ప్రస్తుతం వచ్చిన స్ట్రెయిన్ తీవ్రంగానే ఉందన్నారు. డెంగీ జ్వరాలకు సరిపడా ఔషధాలు, టెస్ట్ కిట్లు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ కమిషనర్  భాస్కర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments