Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్కీ సౌజన్యది... హత్యా...? ఆత్మహత్యా...?

Webdunia
శనివారం, 30 మే 2015 (08:32 IST)
విజయవాడలో టెక్కీది ఆత్మహత్యా...! లేక హత్యా..! అసలు ఆ రోజు ఏమి జరిగింది.? తల్లిదండ్రులు ఎందుకు నోరు మెదపడం లేదు..? ఆమెను పై నుంచి కిందకు ఎవరైనా తోసేశారా.. ఆమె తనంతట తానే దూకేసిందా..! ఇలాంటి అనుమానాలు ఎన్నో కలుగుతున్నాయి. ఇదే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అజిత్సింగ్ నగర్ లోటస్ ల్యాండ్ మార్క్లోని అపార్ట్‌మెంట్‌ నుంచి ఆమె కిందకు పడుతున్న సీసీ కెమెరా పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు  రెండో కుమార్తె సౌజన్యకు ఈ నెల 20వ తేదీన వివాహం జరిగింది. సాప్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న ఆమెకు కృష్ణలంకకు చెందిన దిలీప్ అనే సాప్ట్వేర్ ఇంజనీర్తో వివాహం అయింది. దంపతులు ఇద్దరూ హైదరాబాద్లోనే కాపురం పెట్టారు. వారం రోజుల పాటు భర్తతో కలిసి పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్లి వచ్చింది. కాగా ఈ నెల 27వ తేదీన భర్తతో కలిసి హైదరాబాద్ కు వెళ్లాల్సి వుంది. అయితే అదే రోజు లోటస్ ల్యాండ్ మార్క్లోని అయిదో అంతస్తు నుంచి సౌజన్య కిందపడి మృతి చెందింది. ఆ సమయంలో  తల్లిదండ్రులు తెనాలిలోని ఓ వివాహానికి వెళ్లారు.
 
అదేరోజు సౌజన్య ఎనిమిదో బ్లాక్లోకి వెళ్లినట్లు సీసీ టీవీ పుటేజ్ ద్వారా తెలుస్తోంది. తరవాత ఆమె అయిదో అంతస్తుకు చేరుకుని అక్కడి నుంచి కింది పడినట్లు దృశ్యాలు రికార్డు కావడంతో పోలీసులు అనుమానిస్తున్నారు. చావాలనుకున్న తరువాత వీలైనంత ఎత్తు నుంచి దూకుతారు. కానీ ఎనిమిదో అంతస్తుకు చేరుకున్న సౌజన్య ఎందుకు మూడు అంతస్తులు దిగింది.? ఐదో అంతస్తు వరకూ దిగింది. అక్కడ నుంచి ఆమె పడిపోయారు. మరి ఈ మధ్యలో ఏం జరిగింది.? మూడు అంతస్తులలో ఆమె వెంట ఎవరైనా ఉన్నారా..! ఆమె ఎలా వ్యవహరించారు..? ఆమె దిగి వస్తున్న క్రమంలో ఆమెను ఎవరైనా తోసేశారా..? ఆ సమయంలో సిసి కెమెరాల్లో ఎవరెవరైనా ఆ ప్రాంతంలో తచ్చాడారా... అనే కోణంలో పోలీసులు ఫుటేజీ పరిశీలన మొదలు పెట్టారు. 
 
మృతురాలు ఉపయోగించిన సెల్ ఫోన్లోని డేటా ఆధారంగా విచారణను ముమ్మరం చేశారు. ఆమె ఎవరితో మాట్లాడారు. ?తల్లిదండ్రులతో ఎంత సేపు మాట్లాడారు. ? భర్తతో ఎంతసేపు మాట్లాడారు. ?వీరు కాకుండా మరెవరితోనైనా మాట్లాడారా..? అనే సమాచారాన్ని రాబడుతున్నారు. అదే సమయంలో ఆమెకు అసలు పెళ్లి ఇష్టముందా లేదా.. పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన సందర్భంగా భర్తతో ఏమైనా గొడవలు జరిగాయా.. ! అనే కోణంలో కూడా విచారణ సాగుతోంది. సౌజన్య తలకు స్కార్ఫ్ కట్టుకుని వుండటంతో ఆమె ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందిందా, లేక ఆత్మహత్యకు ప్రయత్నించిందా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. 
 
స్కార్ప్ కట్టుకుంటే కింద పడడం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. స్కార్ఫ్ పూర్తిగా తలను కవర్ చేస్తుందేగానీ, ముఖానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇలాంటి పరిస్థితులలో స్కార్ఫ్ వలన ప్రమాదం జరిగి ఉంటుందనడంలో ఎంత వరకూ వాస్తవం ఉంటుంది.? మరోవైపు దంపతుల మధ్య కలహాలే.. ఈ మరణానికి దారితీశాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగుతోంది. కుటుంబసభ్యులు సంఘటన ముందు జరిగిన పరిణామాలపై నోరు మెదపడం లేదు. తాము కుమార్తె చనిపోయిన బాధలో ఉన్నామని, ఇప్పుడేమి మాట్లాడలేమని మాత్రమే చెబుతున్నారు. మొత్తంపై సౌజన్య మృతి మిస్టరీగానే ఉంటోంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments