Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ముసలి తోడేలు-గుంట నక్క' కథ చెప్పిన సినీనటి శ్యామల.. ట్రోల్స్ మొదలు

సెల్వి
సోమవారం, 6 మే 2024 (12:03 IST)
ఏపీ ఎన్నికల్లో భాగంగా వైసీపీ తరపున స్టార్ యాంకర్, సినీనటి శ్యామల ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీడీపీ బీజేపీ జనసేన కూటమిపై పరోక్ష విమర్శలు చేశారు శ్యామల. ''ముసలి తోడేలు-గుంట నక్క'' అంటూ ఆమె చెప్పిన కథ వైరల్ అవుతోంది. అయితే దీనిపై నెటిజన్ల నుంచి శ్యామలకు గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి. 
 
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ మీ చేతుల్లో ఉంది. 2019, 2014 మేనిఫెస్టోలను పట్టుకుని సీఎం జగన్ తిరుగుతున్నారు. నాకు మంచి జరిగితేనే ఓటు వేయండి అని చెప్పగలిగే దమ్మున్న నాయకుడు జగన్.. ఆయనని గెలిపించడానికి శ్యామల ఎప్పుడూ సిద్ధమే. 
 
ఏపీ ప్రజలంతా సిద్ధంకండి అంటూ ఆమె పిలుపునిచ్చింది. అయితే శ్యామల పరోక్షంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారంటూ ఆ రెండు పార్టీల కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అటు నెటిజన్లు కూడా ఆమెను ట్రోల్స్‌ చేస్తున్నారు. 
 
మరికొందరు శ్యామల భర్త నర్సింహారెడ్డిపై గతంలో నమోదైన చీటింగ్ కేసును, శ్యామల బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వీడియోలను షేర్ చేస్తూ నువ్వు మాకు నీతులు చెప్పొద్దని కామెంట్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... జాన్వీ కపూర్‌కు అంత కాస్ట్లీ గిఫ్టా?

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments