కేంద్రమంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి ప్రత్యేక హోదా అవసరమే లేదంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు. 'ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయం. ఇంకా దాని గురించి మాట్లాడడం అనవరం' అంటూ వ్యాఖ్యలు చేశారు. జల్లికట్టు స్ఫూర్తిగా తీసుకొనే వారు ఏ కోళ్లపందా
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రజలు ఇంతగా తపిస్తున్నా అధికారంలో ఉన్న నేతలకు ప్రజాకాంక్ష ఏమాత్రం పట్టినట్టు కనిపించడం లేదు. కేంద్రమంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి ప్రత్యేక హోదా అవసరమే లేదంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు. 'ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయం. ఇంకా దాని గురించి మాట్లాడడం అనవరం' అంటూ వ్యాఖ్యలు చేశారు. జల్లికట్టు స్ఫూర్తిగా తీసుకొనే వారు ఏ కోళ్లపందాలో, పందుల పందాలో నిర్వహించుకోవాలని ఆయన నోరుపారేసుకోవడంతో.. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే సుజనా చౌదరి వ్యాఖ్యలపై సినీ రచయిత చిన్ని కృష్ణ ఘాటుగా స్పందించగా.. సోషల్ మీడియాలో సైతం సుజన, సీఎం చంద్రబాబు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
సుజనా వ్యాఖ్యలపై సినీ రచయిత చిన్ని కృష్ణ ఏమన్నారు?
సుజనా చౌదరి వ్యాఖ్యలపై ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్న సుజనా చౌదరే పంది అని విమర్శించారు. అలాంటి పందివైన నీతోనే ఆట స్టార్ చేస్తామని ఆయన హెచ్చరించారు. పెద్దల సభకు ఎంపికైన సుజనాకు ఏ అర్హత ఉందని హోదా గురించి మాట్లాడుతున్నాడు, తెలుగు ప్రజలను కోళ్లపందేలు, పందుల పందేలతో ఆడుకోమంటాడా, ఏం తెలుసు వాడికి అంటూ చిన్ని కృష్ణ ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్ జగన్, పవన్ కల్యాణ్‌లను విమర్శిస్తే ఊరుకోబోమన్నారు. విద్యార్థులను అరెస్టు చేస్తే హోదా ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని చిన్ని కృష్ణ పేర్కొన్నారు.
ఇక ఆంధ్ర నెటిజన్లు సోషల్ మీడియాలో చేసిన కామెంట్లు, పోస్టులు చూస్తే తెలుగు ప్రజలకు సుజనాపై ఇంత ఆగ్రహం ఉందా అనిపస్తుంది. మచ్చుకు కొన్ని..
జల్లికట్టు స్ఫూర్తిగా తీసుకొనే వారు కోడి పందేలో.. పందుల పందేలో ఆడుకోండి అన్న సుజనాకు ఒక నెటిజన్ అదే శైలిలో జవాబిచ్చాడు. ఈ పంది కేంద్రమంత్రి ఎలా అయ్యాడో ఎవరికైనా తెలుసా అంటూ తీవ్ర వ్యాఖ్య చేశాడు. ఇతగాడు మినిస్టర్ కాదు స్కామ్ స్టర్ అంటూ మలేసియా కంపెనీకి సుజనా చౌదరి కంపెనీ 140 కోట్లరూపాయల రుణం ఎగ్గొట్టిన ఘటనను మరోసారి గుర్తు చేశాడు.
ప్రత్యేక హోదాతో బాగుపడిన రాష్ట్రం ఏదైనా ఉందా? అని కామెంట్ చేసిన సుజనాను ఈ విషయం ఎన్నికలప్పుడు తెలీదా నాయనా అంటూ ఎద్దేవా చేసారు మరో నెటిజన్.
సుజనాను గురువారం పొడవునా ఆడుకున్న నెటిజన్లు తమ కోపం ముఖ్యమంత్రిపైకి కూడా మళ్లించారు. ఓటుకు నోటు ఇచ్చే సీఎం.. ఎంఆర్వోనీ కొట్టే ఎంఎల్ఏ, బీకామ్‌లో మ్యాథ్స్ ఫిజక్స్ చదివిన ఎమ్మెల్యే, శాతకర్ణి సినిమా గురించి ఆంధ్రప్రదేశ్ సీఎం ట్విట్టర్ నుంచి ట్వీట్ చేసే పార్టీ అధ్యక్షుడి కొడుకు, ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారుతో అమ్మాయి వెంట పడినా, కరెంటు స్తంభాలను గుద్దినా కాపాడే వారి విశ్వాసమైన కుక్కలు... జనవరి 26ని స్వాతంత్ర దినోత్సవం అని చెప్పే ఆంద్రప్రదేశ్ డీజీపీ... మన రాష్ట్ర ప్రభుత్వ దిగ్గజాలు మరియు అనుచరుల వర్గం లీలలివి. వాహ్ శభాష్ .. తెలిసినవి కొన్ని.. తెలియాల్సినవి ఇంకెన్నో అంటూ ఎద్దేవా చేశారు మరొక నెటిజన్..
సుజనా ఒకటి తలిస్తే మరొకటి జరిగినట్లు తనపైనే కాకుండా టీడీపీ అధినేతతో సహా పార్టీ మొత్తంపైనే నెటిజన్లు విరుచుకుపడటం షాక్ కలిగిస్తోంది.