బాలింత అయిన తన భార్యను ఇంటికి పంపలేదనే కోపంతో పిల్లనిచ్చిన మామను అమ్ములతో పొడిచి చంపేశాడు.. అల్లుడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. చిన్న చిన్న కారణాలే పెను హత్యలకు దారితీస్తున్నాయనేందుకు ఈ ఘటన
బాలింత అయిన తన భార్యను ఇంటికి పంపలేదనే కోపంతో పిల్లనిచ్చిన మామను అమ్ములతో పొడిచి చంపేశాడు.. అల్లుడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. చిన్న చిన్న కారణాలే పెను హత్యలకు దారితీస్తున్నాయనేందుకు ఈ ఘటనే నిదర్శనమని పోలీసులు చెప్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లె పంచాయతీలోని ఇందిరానగర్ చెంచు కాలనీకి చెందిన పులసల వెంకటేశ్వర్లు తన కుమార్తె గురవమ్మను దోర్నాల మండలం కోడపోలు గ్రామానికి చెందిన ఉడతల గురవన్నకిచ్చి ఏడాది క్రితం వివాహం చేశాడు.
గురవమ్మ కాన్పు కోసం 20 రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. భర్త కూడా ఆమె వెంటే వచ్చేశాడు. పదిరోజుల క్రితం తన భార్య, బిడ్డను తనతో పంపించాల్సిందిగా గురవన్న పట్టుబట్టాడు. అందుకు వెంకటేశ్వర్లు ససేమిరా అన్నాడు. పది రోజుల తర్వాత ఇంటికి పంపుతానన్నాడు. అయినా వినని గురవన్న బుధవారం మద్యం తాగి మామగారితో గొడవకు దిగాడు. ఈ గొడవ కాస్తా పెద్దది కావడంతో.. ఆవేశంతో ఊగిపోయిన గురవన్న ఇంటిలో ఉన్న అమ్ములను తీసుకొచ్చి మామమీదికి విసిరాడు.
వెంకటేశ్వర్ల గొంతుకు అది గుచ్చుకొవడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. దీంతో భయాందోళన చెందిన గురవన్న తనవద్ద ఉన్న అమ్ములను తీసుకొని తన కడుపులో పొడుచుకున్నాడు. ఫలితంగా కొన ఊపిరితో ఉన్న గురవన్న ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.