Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు అమ్మాయి... హైద‌రాబాదులో ఆత్మ‌హ‌త్య‌...ఎందుకు?

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (12:26 IST)
హైద‌రాబాదులోని ఒక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్రనగర్‌లో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్‌ సిఐ కనకయ్య కథనం మేరకు, నెల్లూరుకు చెందిన సుదీప్తి (27) అనే అవివాహిత బండ్లగూడజాగీర్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఉంటూ ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా పనిచేస్తోంది.


ఈ నెల 6 న అనారోగ్యంతో ఆమె స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లింది. మూడు రోజులుగా ఆమె ఆసుపత్రిలో చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె ఆసుపత్రి నుండి డిశ్ఛార్జి కావాల్సి ఉంది. ఆ రోజు ఉదయం 9 గంటల సమయంలో సుదీప్తి గదిలోకి నర్సు వెళ్లగా, లోపలి నుంచి తలుపు గడియపెట్టుకొని ఉంది. సిబ్బంది తలుపు బద్దలు కొట్టి లోపలికెళ్లి చూశారు. సుదీప్తి ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.


యువతి తల్లి బెంగళూరులో ఆమె సోదరుడి దగ్గర ఉంటోంది. వెంటనే ఆసుపత్రి నిర్వాహకులు రాజేంద్రనగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అస‌లు ఆమె ఎందుకు ఆత్మహ‌త్య‌కు పాల్ప‌డింద‌నే కార‌ణాల కోసం విచార‌ణ జ‌రుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments