గుర్తు పెట్టుకో సజ్జలా.. నాకు ఆడియో కాల్స్ వస్తే.. నీకు వీడియో కాల్స్ వస్తాయి.. కోటంరెడ్డి

Webdunia
ఆదివారం, 5 ఫిబ్రవరి 2023 (12:56 IST)
ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి వైకాపాకు చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గట్టివార్నింగ్ ఇచ్చారు. గుర్తుపెట్టుకో.. సజ్జలా.. నాకు ఆడియో కాల్స్ వస్తే.. నీకు వీడియో కాల్స్ వస్తాయి అంటూ హెచ్చరించారు. అయితే, ఎన్ని బెదిరింపు కాల్స్ వచ్చినా భయపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. సజ్జల కోటరీ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి కూడా ఫోన్ చేసి బెదిరించారని కోటంరెడ్డి ఆరోపించారు. అవసరమైతే తనపై హత్యాయత్నం కేసు కూడా పెట్టుకోవచ్చని కోటంరెడ్డి సూచించారు.
 
పార్టీకి చెందిన 13 మంది మంత్రులు, సలహాదారులు, ప్రాంతీయ కోఆర్డినేట్రలు తన వ్యక్తిత్వాన్ని అనుమానించే రీతిలో మాట్లాడుతుంటే తప్పని పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తుందని రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు.
 
అంతేకాకుండా, వైకాప నేతలు తన ఫోన్‌ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా బయటపెడతానని అన్నారు. ఈ క్రమంలో ఆయన భద్రతను కూడా పోలీసులు కుదిపించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరోమారు చర్చనీయాంశమైంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

Mammootty: 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో మెరిసిన మమ్ముట్టి భ్రమయుగం

Chinnay : రాహుల్ రవీంద్రన్, చిన్నయ్ వివాహంపై సెటైర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments