Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపురానికి రాని భార్య... అత్తను నరికి చంపిన అల్లుడు

Webdunia
గురువారం, 14 మే 2020 (08:46 IST)
నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. ఆ భార్య భర్తతో సంసారం చేసేందుకు నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన భర్త.. ఆమె తల్లిని అంటే అత్తను నరికి చంపేశాడు. ఈ దారుణ ఘటన జిల్లాలోని దూబగుంట గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దూబగుంట గ్రామానికి చెందిన తిరుపాల్ అనే వ్యక్తి కొన్నేళ్ళ క్రితం చౌట భీమవరానికి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే, తిరుపాల్‌ పచ్చి తాగుబోతు. 
 
ప్రతిరోజూ మద్యం సేవించి వచ్చి భార్యను చిత్ర హింసలకు గురిచేసేవాడు. పలు మార్లు చితకబాదాడు. భర్త వేధింపులు భరించలేని భార్య... యేడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత కాపురానికి రావాలంటూ పలుమార్లు ప్రాధేయపడ్డాడు. 
 
అయినప్పటికీ భార్య ససేమిరా అన్నది. దీంతో ఆగ్రహించిన తిరుపాల్.. బుధవారం ఉదయం పీకల వరకు మద్యం సేవించి.. అత్తగారింటికి వెళ్లాడు. మళ్లీ కాపురానికి రావాలంటూ భార్యతో గొడవడుతున్నారు. 
 
ఆ సమయంలో అత్త పోలమ్మ అడ్డు వచ్చింది. దీంతో తిరుపాల్ నిగ్రహం కోల్పోయి అత్తపై విచక్షణారహితంగా దాడి చేసి, నరికి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పోలమ్మ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

Odela 2: మా నాన్నమ్మనుంచి ఓదెల 2లో నాగసాధు పాత్ర పుట్టింది : డైరెక్టర్ సంపత్ నంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments