Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నేను అడిగినంత ఇవ్వకపోతే నువ్వు అన్నం ఎలా తింటావో చూస్తా'.. తెరాస ఎంపీకి నయీం వార్నింగ్

గ్యాంగ్‌స్టర్ నయీం ఆగడాలు అన్నీఇన్నీకావు. ఆయన హతమైన తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నయీం జీవించివున్నప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎంపీలకే వార్నింగ్ ఇచ్చినట్టు ఇపుడు వెలుగులోకి వస

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2016 (11:27 IST)
గ్యాంగ్‌స్టర్ నయీం ఆగడాలు అన్నీఇన్నీకావు. ఆయన హతమైన తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నయీం జీవించివున్నప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎంపీలకే వార్నింగ్ ఇచ్చినట్టు ఇపుడు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వార్నింగ్‌లే ఆయన ప్రాణాల మీదికి వచ్చాయి. ఫలితంగా పక్కా స్కెచ్ వేసిన తెలంగాణ ప్రభుత్వం.. నాయీం కదలికలపై నిఘా పెట్టి.. ఎన్‌కౌంటర్ పేరుతో హతమార్చింది. తెరాస ఎంపీని, ఓ మంత్రిని నయీం బెదిరించాడు. ఇదే అంశంపై ఉత్తర తెలంగాణాకు చెందిన ఓ మంత్రి ఏకంగా సీఎం కేసీఆర్‌కే ఫిర్యాదు చేశారు.
 
'నయీమ్ ఆగడాలు అన్నీఇన్నీ కాదు. బయట తిరగలేకపోతున్నాం.. మమ్మల్ని సైతం బెదిరిస్తున్నాడు.. రూ.కోట్లకు కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంటే వాడికి లెక్క లేదు..' అని సీఎం వద్ద ఆ మంత్రి వాపోయారు. అప్పట్నుంచే నయీమ్ ఆగడాలపై పోలీసు యంత్రాంగం ఓ కన్నేసి ఉంచింది. ఇక హైదరాబాద్ పరిసరాల్లోని అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీని రూ.25 కోట్లు ఇవ్వాల్సిందిగా నయీమ్ డిమాండ్ చేశాడు. 'ఇవ్వకపోతే నువ్వు అన్నం ఎలా తింటావో చూస్తా..' అని బెదిరించాడు.
 
రాష్ట్రంలో ఉన్నత స్థాయి రాజకీయ సంబంధాలున్న మరో పారిశ్రామికవేత్తను రూ.75 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ రెండు ఘటనలు కూడా అధికార పార్టీ నేతల్లో వణుకు పుట్టించాయి. ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖ రాజకీయ నేతలనూ నయీమ్ లెక్కచేయలేదు. ఇలా గత రెండేళ్లలో పదుల సంఖ్యలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నయీమ్ బాధితుల జాబితాలో చేరిపోయారు. నయీమ్ ఆగడాలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో సీఎం ఆదేశం మేరకు... టీఎస్ పోలీసులు పక్కా స్కెచ్‌తో నయీంను హతమార్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments