Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాటింగ్.. నేవీ ఆఫీసర్‌నే మోసం చేసిన కి''లేడీ''.. రూ.50కి రీఛార్జ్ చేయమని.. 50వేలు కొట్టేసింది.. ఎలా?

సోషల్ మీడియా ప్రభావం నేటి యువతపైనే కాదు.. అందరిపైనా ఉంది. పురుషులైతే ఇంటికొచ్చినా కూడా ఇంటి సమస్యలను పక్కనబెట్టి సోషల్ మీడియాను చూస్తూ కూర్చుంటారు. అలా ఖాళీ సమయాల్లో ఫేస్ బుక్ చాటింగ్‌తో కాలక్షేపం చేస

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (17:36 IST)
సోషల్ మీడియా ప్రభావం నేటి యువతపైనే కాదు.. అందరిపైనా ఉంది. పురుషులైతే ఇంటికొచ్చినా కూడా ఇంటి సమస్యలను పక్కనబెట్టి సోషల్ మీడియాను చూస్తూ కూర్చుంటారు. అలా ఖాళీ సమయాల్లో ఫేస్ బుక్ చాటింగ్‌తో కాలక్షేపం చేసే ఓ నేవీ ఆఫీసర్‌ను ఓ కి''లేడీ'' దారిలో పెట్టింది. అంతే ఆమె మాటలు నమ్మిన విశాఖ నేవీ ఆఫీసర్ మోసపోయాడు.
 
వివరాల్లోకి వెళితే.. విశాఖ నేవీ ఆఫీసర్ హర్షుక్ ఫేస్ బుక్‌లో చాటింగ్ ద్వారా అమ్మాయి పరిచయమైంది. హర్షుక్‌తో మాట్లాడాలని ఫోన్ నెంబర్ అడిగి తీసుకుంది. ఫోన్ మాట్లాడితే డబ్బుల్లేవంది. ఆన్‌లైన్‌లో రీచార్జ్ చేయడం తనకు తెలియదని హర్షుక్ చెప్పినా.. లింకు పంపింది. ఆ లింకు ద్వారా ఈజీగా రీఛార్జ్ చేసుకోవచ్చని తెలిపింది. దీన్ని నమ్మిన హర్షుక్.. అమ్మాయి పంపిన లింకుపై యాభై రూపాయ‌లు రీఛార్జ్ చేశాడు. 
 
అయితే హ‌ర్షుక్‌కి వెంట‌నే ఓ మెసేజ్ వ‌చ్చింది. త‌న బ్యాంకు అకౌంట్ నుంచి 50 వేల రూపాయ‌లు క‌ట్ అయ్యాయంటూ వచ్చిన మెసేజ్ చూసి షాక‌య్యాడు. వెంట‌నే హ‌ర్షుక్ స్థానిక పోలీసుల‌కి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసును సైబ‌ర్ క్రైం పోలీసుల‌కి బ‌దిలీ చేశారు. విచారణలో మాయలేడీ ఒరిజినల్ లింక్ పంపలేదని.. డబ్బులు కాజేసే ఈజీ లింకును పంపిందని.. ఆ డబ్బుతో మొబైల్ ఫోన్లు కొనేసిందని పోలీసులు తెలిపారు. బాగా చ‌దువుకొని ఉన్నత హోదాలో ఉన్న వ్య‌క్తి కూడా మోసపోయాడ‌ని, ఇటువంటి వారిని న‌మ్మ‌కూడ‌ద‌ని పోలీసులు చెప్పారు. 
 
ఫేస్‌బుక్‌లో అమ్మాయిల పేరుతో ప‌రిచ‌యమ‌వుతున్న సైబ‌ర్ నేర‌గాళ్లు ఇటువంటి నేరాల‌కు పాల్ప‌డుతున్నార‌ని.. సోషల్ మీడియా చాటింగ్‌లో జాగ్రత్తగా వ్యవహరించాలని హలో బాయ్ వరకే పరిమితం కావాలని పోలీసులు సూచిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments