పేద ముస్లింలకు తోఫా ఇచ్చిన నాట్స్, మోహనకృష్ణ మన్నవ ట్రస్ట్

Webdunia
సోమవారం, 25 మే 2020 (15:00 IST)
గుంటూరు నగరంలో కరోనా నియంత్రణకు పెట్టిన లాక్‌డౌన్‌తో పేద ముస్లింలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంజాన్ పండుగ సమయంలో పనులు లేక పండుగ చేసుకోవడం కూడా కష్టమైన తరుణంలో మోహనకృష్ణ మన్నవ ట్రస్ట్, ఉత్తర అమెరికా తెలుగుసంఘం నాట్స్ పేద ముస్లింకు సాయం అందించేందుకు ముందుకొచ్చాయి.
 
గుంటూరు నగరంలోని కళ్యాణ్ నగర్, మారుతీ నగర్‌లోని సుమారు 500 పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్‌ను తోఫాగా అందించాయి. పేద ముస్లింల పరిస్థితిని స్థానిక ముస్లిం పెద్దలు నాట్స్ మాజీ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఆయన స్పందించి ముస్లింలు పండుగ జరుపుకునేందుకు కావాల్సిన నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు కావాల్సిన సాయం చేశారు.
 
తాము పండుగ ఎలా జరుపుకోవాలా..? అనే ఆందోళనతో ఉన్న తమకు నాట్స్, మోహనకృష్ణ మన్నవ చేసిన సాయం మరువలేనిదని స్థానిక ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో స్థానికులైన మస్తాన్ వలి, బాజీ, స్వరూప్, సాయినాధ్, అంబరీష్, చైతన్య, సీకే రావు, అఖిల్, అనంత్, చిన్న మీరవాలి, సయ్యద్ మాబు, మాలిక్ రఫీ ఫునిషా, తేజ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments