Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురంలో 500 కార్మిక కుటుంబాలకు నాట్స్ సాయం

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (23:15 IST)
తెలుగునాట లాక్‌డౌన్‌తో పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన వంతు సహాయం చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే అనంతపురంలో కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోయిన కూలీలకు నాట్స్ సాయం చేసింది.
 
నగరంలోని కంకర క్వారీలో కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విషయం నాట్స్ ఉపాధ్యక్షులు నూతి బాపయ్య చౌదరి(బాపు) దృష్టికి స్థానికులు తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. వారికి నిత్యావసరాలు, కూరగాయలకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని చేశారు. దీంతో స్థానిక నాయకులు నాట్స్ సంస్థ ఆధ్వర్యంలో 500 కార్మిక కటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేశారు.
 
తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్‌తో పనులు లేక ఉపాధి కోల్పోయిన కార్మికుల ఇబ్బందులు తెలుసుకుని వారికి సాయం అందించడానికి ముందుకు వచ్చిన నాట్స్ సంస్థకు, నాట్స్ ఉపాధ్యక్షులు బాపయ్య చౌదరి నూతి (బాపు) గారికి స్థానిక నేతలు మణి, సరస్వతి, శ్రీనివాసులు ధన్యవాదాలు తెలిపారు. తెలుగునాట నిరుపేదలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నా ఆ విషయం తమ దృష్టికి వస్తే తగిన సాయం చేస్తున్నామని నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments