Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసభ్య పదజాలంతో దూషించారంటూ అయ్యన్నపాత్రుడిపై కేసు

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (10:20 IST)
పోలీసులను, అధికార వైకాపా పార్టీ నేతలను అసభ్య పదజాలంతో దూషించారంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయ్యన్నపాత్రుడుతో సహా మొత్తం 9 మంది తెదేపా నాయకులపై అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీసులు కేసులు నమోదు చేశారు. 
 
నర్సీపట్నంలో మరిడి మహాలక్ష్మి పండుగ పెద్ద జాగారం వేడుకలు జరిగాయి. ఇందులోభాగంగా ఈ నెల 15వ తేదీన అబీద్ కూడలిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అయ్యన్నపాత్రుడుతో పాటు మరికొందరు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. 
 
రాత్రి 11.10 గంటల సమయంలో అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ తదితరులు పోలీసులను, వైకాపా నేతలను దూషించి, పోలీసుల విధులకు ఆటంకాలు కలిగించారని పేర్కొంటూ నర్సీపట్నం పోలీసులు ఐపీసీ 353, 294 (ఏ, బి), 504, 505(ఏ), రెడ్‌విత్ 34 కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments