నరసరావుపేట వైకాపా ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

Webdunia
ఆదివారం, 23 ఆగస్టు 2020 (14:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేంగా వ్యాపిస్తోంది. ఈ కారణంగానే ఇక్కడ ప్రతి రోజూ పదివేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అనేక మంది ప్రజాప్రతినిధులు ఈ వైరస్ బారినపడుతున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే ఈ వైరస్‌కు సోకింది. 
 
ఆయన ప్రజాప్రతినిధి పేరు గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. తనకు కరోనా వైరస్ సోకినట్టు ఆయన స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు చెప్పుకొచ్చారు. 
 
అంతేకాకుండా, ప్రజలెవరూ అధైర్యపడవద్దని, తాను కోలుకుని పూర్తి ఆరోగ్యంతో మళ్లీ ప్రజల ముందుకు వస్తానని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నానని చెప్పారు. తాను కోలుకునే వరకు తన వద్దకు ఎవరూ రావద్దని కోరారు.
 
ఇటీవల తనను కలిసిన వారు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచించారు. కరోనా సోకినప్పటికీ స్థానిక నేతలతో పాటు అధికారుల సాయంతో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: దీపావళి శుభాకాంక్షలతో అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ

James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments