Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెంట్ కోతలు లేకుండా చూడండి సీఎంగారూ... లేదంటే జనాలు మీ నాయకుల్ని తంతారు

Webdunia
శుక్రవారం, 28 జూన్ 2019 (13:05 IST)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీమంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయన మాటాల్లోనే... నిజాయితీకే సిగ్గుచేటు అన్నవిధంగా..  అక్ర‌మాస్తుల కేసులో ఏ1 గారు అవినీతిపై క‌మిటీ వేశారు. ఏ2 విజయసాయిరెడ్డి గారు విచార‌ణ చేస్తార‌ట‌! క‌లికాలం కాక‌పోతే అక్ర‌మాల విక్ర‌మార్కులు నీతి నిజాయితీ గురించి మాట్లాడటమా!! .

వైఎస్ గారి హ‌యాంలో సోలార్ విద్యుత్‌ యూనిట్ రూ.14కి కొంటే, టీడీపీ హ‌యాంలో రూ. 2.70 యూనిట్ కొన్నారు. మీ నాయ‌న‌గారి నిర్వాకంతో డిస్కంల‌కు రూ. 8 వేల‌కోట్లు న‌ష్టం వ‌చ్చింది. ఈ ఉదాహరణలు చాలవా, ఎవ‌రు మ‌హామేతో! ఎవ‌రు దార్శ‌నిక నేతో తెలుసుకోడానికి.
 
అన్న‌య్య‌లూ నాకేం తెలియ‌దంటూనే ఎలాంటి విచారణ జరగకుండా, కనీస ఆధారాలు లేకుండా 2,636 కోట్లు అవినీతి జ‌రిగింద‌ని తేల్చారు. గుడ్డ కాల్చి వెయ్యడంలో మీకు మీరే సాటి వైఎస్ జగన్ గారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చేనాటికి 22 మిలియన్ యూనిట్ల లోటు  విద్యుత్తు నుండి మిగులు విద్యుత్తు సాధించి 5 ఏళ్లలో 150కి పైగా అవార్డులు సాధించడం మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం.
 
విద్యుత్ ఉత్పత్తిలో ఏపీని దేశానికే ఆదర్శంగా నిలిపాం. గడిచిన 5 ఏళ్లలో రూ. 36 వేల కోట్ల పెట్టుబడి, 13 వేల మందికి పైగా ఉద్యోగాలు లభించాయి. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు అంటూ పెట్టుబడులు అడ్డుకొని రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకురావొద్దని స్వయంగా కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి ఆనంద్ కుమార్ మీకు లేఖ రాసిన విషయం మర్చిపోయారా?
 
నీతి, నిజాయితీ పునాదిగా ఎదిగిన మా అధినేత చంద్రబాబు గారిపై అవినీతి ముద్ర వెయ్యాలి అనుకుంటున్న మీ ప్రయత్నం విఫలయత్నంగానే మిగిలిపోతుందని నారా లోకేష్ ట్వీట్ చేయగా దీనికి రిప్లైగా ఓ నెటిజన్... ముందు కరెంట్ కోతలు లేకుండా చూడండి లేదంటే జనాలు మీ నాయకుల్ని తంతారు సీఎం గారు అంటూ ట్వీటాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments