Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాసనసభ సాక్షిగా ఆడబిడ్డను అవమానిస్తే స్పీకర్‌గా నువ్వు పీకిందేంటి తమ్మినేని : నారా లోకేశ్ ఫైర్

ఠాగూర్
మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (11:54 IST)
శాసనసభ సాక్షిగా ఎన్టీఆర్ కుమార్తెను అవమానిస్తే స్పీకర్‌గా నువ్వు పీకిందేంటి అని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. ఆయన తాను చేపట్టిన శంఖారావం సభ శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జరిగింది. ఇందులో సిట్టింగ్ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డమా బుస్సు ఎమ్మెల్యే అంటూ తమ్మినేనిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2014 తర్వాత ఆముదాలవలస నియోజకవర్గాన్ని టీడీపీ ఎంతో అభివృద్ధి చేసిందని, కానీ 2019లో ప్రజలు ఇక్కడ డమా బుస్సు ఎమ్మెల్యేని గెలిపించారని లోకేశ్ వెల్లడించారు. అందుకు మనం కూడా కారణమే... నాడు మనం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయాం అని వివరించారు.
 
'ఈ డమా బుస్సు ఎమ్మెల్యే అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో చెబుతుంటాడు... తనకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆరేనని అంటుంటాడు. ఈ డమా బుస్సును అడుగుతున్నా... అదే ఎన్టీఆర్ కుమార్తెను శాసనసభ సాక్షిగా అవమానిస్తే నువ్వు పీకిందేంటి? చేసిందేంటి? ఇవాళ శాసనసభకు కనీస గౌరవం లేదంటే అందుకు కారణం ఈ డమా బుస్సు ఎమ్మెల్యే. వాస్తవానికి 2019కి ముందు తమ్మినేని సీతారాంను నేను చాలా గౌరవించాను. ఎప్పుడైతే శాసనసభ సంప్రదాయాలను ఉల్లంఘిస్తూ, ప్రతిపక్ష నేతను అవమానిస్తుంటే పట్టించుకోలేదో, ఆ రోజే ఆయన గౌరవం పోగొట్టుకున్నాడు. 
 
ఈ డమా బుస్సు ఎమ్మెల్యే అవినీతిలో పలాస ఎమ్మెల్యే కొండలరాజుతో పోటీ పడుతున్నాడు. ఐదేళ్లలో ఎవరూ ఊహించనంతగా రూ.1000 కోట్లు సంపాదించాడీ డమా బుస్సు ఎమ్మెల్యే. లాండ్, శాండ్, మైన్ అన్నింటికీ ఆముదాలవలసను అడ్డాగా మార్చేశాడీ డమా బుస్సు ఎమ్మెల్యే. కొడుకు పెళ్లి జరిగితే కాంట్రాక్టర్లను వేధించి రూ.1.30 కోట్లు వసూలు చేశాడు. కేవలం ఇసుకలోనే రూ.300 కోట్లు స్వాహా చేశాడు. వాలంటీరు పోస్టులు, అంగన్వాడీ పోస్టులు, షిఫ్టు పోస్టులు సొంత కార్యకర్తలకు కాదు కదా, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి ఇచ్చాడు ఈ డమా బుస్సు ఎమ్మెల్యే" అంటూ లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments