Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలి: మంత్రి నారా లోకేశ్

ఠాగూర్
ఆదివారం, 27 అక్టోబరు 2024 (10:31 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలతో పాటు.. అమెరికా పారిశ్రామికవేత్తలకు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న నారా లోకేశ్... నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు మీ నుంచి రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు కియా ఒక ఉదాహరణ అన్నారు.
 
రాష్ట్రంలో ప్రస్తుతం పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం నెలకొని ఉందన్నారు. ఏపీలో దేశంలోనే 2వ అతిపెద్ద తీరప్రాంతం ఉంది. త్వరలో 4 కొత్త పోర్టులు రాబోతున్నాయి. కర్నూలు జిల్లాను డ్రోన్ వ్యాలీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పించారు. ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలను ఎలక్ట్రానిక్స్ హబ్‌గా తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇప్పటికే దేశంలో తయారయ్యే సెల్ ఫోన్లలో 25 శాతం ఏపీలోనే తయారవుతున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 50 శాతం ఏసీలు కూడా ఏపీలోనే తయారవుతున్నాయని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ప్రకాశం జిల్లాలో బయో ఫ్యూయల్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నట్టు మంంత్రి లోకేశ్ వివరించారు. 
 
మరోవైపు, కృష్ణా, గుంటూరు క్యాపిటల్ రీజియన్‌లో 5 బిలియన్ డాలర్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామన్నారు.  మంత్రి నారా లోకేశ్ తెలిపారు. డిసెంబర్ నుంచి అమరావతి నిర్మాణపనులు ప్రారంభం కాబోతున్నాయని అన్నారు. “గోదావరి జిల్లాల్లో ఆక్వా ఎక్స్ ఫోర్ట్స్, పెట్రో కెమికల్స్, గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమలు, ఉత్తరాంధ్రలో కెమికల్, ఫార్మా రంగాలపై దృష్టిసారించాం. రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖపట్నంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ డేటా సెంటర్ రాబోతున్నాయి. త్వరలో టీసీఎస్ సంస్థ తమ కార్యకలాపాలను ప్రారంభించబోతోంది. రాష్ట్రాన్ని గ్లోబల్ మాన్యూఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు యువకుడైన సాయికాంత్ వర్మ నేతృత్వంలో ఈడీబీని పునరుద్దరించినట్టు తెలిపారు. 
 
రాజకీయంగా జాతీయ స్థాయిలో కీలకపాత్ర వహిస్తుండటం ఏపీకి కలిసొస్తోందన్నారు. భారత్‌లో డేటా రెవెల్యూషన్ రాబోతోంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందులో ఏపీ కీలకపాత్ర పోషించబోతోంది. ప్రధానిమంత్రి మోడీ 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్రం వేగవంతంగా ముందుకు సాగుతోంది. అమెరికాలోని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments