Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులూ.. తస్మాత్ జాగ్రత్త... 2 నెలల తర్వాత మరోలా ఉంటుంది : నారా లోకేశ్

ఠాగూర్
మంగళవారం, 26 మార్చి 2024 (11:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా ప్రభుత్వానికి అంటకాగుతున్న, అధికార పార్టీ నేతలకు అడుగులు మడుగులు ఒత్తుతున్న కానిస్టేబుల్ నుంచి పోలీస్ ఉన్నతాధికారుల వరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఓ హెచ్చరిక చేశారు. మరో రెండు నెలల్లో ప్రభుత్వం మారుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. లేనిపక్షంలో రెండు నెలల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వంలో తగిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 
 
కాకినాడలో శివాలయంలో పూజారులపై వైకాపా మాజీ కార్పొరేటర్ చంద్రరావు దాడి చేసి, కాలితో తన్ని, బూతులు తిట్టిన అంశం ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై నారా లోకేశ్ స్పందిస్తూ, ఐదేళ్ల జగన్‌ పాలనలో రాష్ట్రంలో ప్రశాంతంగా జీవనం సాగించలేని పరిస్థితి నెలకొందన్నారు. వైకాపా మూకల అరాచకానికి అడ్డూఅదుపు లేకుండా పోతోందని మండిపడ్డారు. ఆటవిక చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కాకినాడలో అర్చకులపై దాడి అమానుష చర్యగా పేర్కొన్నారు. 
 
'కాకినాడ శివాలయంలో పూజ సరిగా చేయలేదని గర్భగుడిలో అర్చకులపై వైకాపా నేత సిరియాల చంద్రరావు దాడి చేశాడు. భగవంతుడి సేవ తప్ప మరో ధ్యాసలేని అర్చకులపైనా ప్రతాపమా? పూజారులపై దాడి చేసిన వైకాపా నేతను తక్షణమే అరెస్టు చేయాలి. మరో రెండు నెలల్లో ప్రజా ప్రభుత్వం రాబోతోంది. ఈలోగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పోలీసులకు విన్నవిస్తున్నా' అని లోకేశ్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments