Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటుకు నోటుపై నోటీసులిస్తే మా నెత్తిపై పాలు పోసినట్లే... లోకేష్ వ్యాఖ్య

Webdunia
మంగళవారం, 30 జూన్ 2015 (21:14 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంలో దిట్ట. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వ్యాఖ్య... తెగే వరకు లాగద్దనే కామెంట్ టి.సర్కారునుద్దేశించి అన్నారు. 
 
ఫోన్ ట్యాపింగ్ భయంతో టి.సర్కార్ వణుకుతోందని అన్నారు. ఆ భయమే లేకపోతే తెలంగాణ సర్కారు హోంశాఖ కార్యదర్శిని ఎందుకు మార్చారు...? ఇంటెలిజన్స్ చీఫ్ దీర్ఘకాలిక సెలవుపై ఎందుకు వెళ్లారు...? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఓటుకు నోటు కేసు వ్యవహారంలో తమకు టి. సర్కారు నోటీసులిస్తే తమ నెత్తిన పాలు పోసినట్టేనని వ్యాఖ్యానించారు. వారు నోటీసులు ఎప్పుడిస్తారా అని కోరుకుంటున్నట్లు చెప్పారు. 
 
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మెడకు చుట్టుకుంటుందని కేసీఆర్ భయపడుతున్నారనీ, అందువల్లనే చంద్రబాబుకు ఎదురుపడలేకనే గవర్నర్ విందుకు గైర్హాజరయ్యారని అన్నారు లోకేష్. మొత్తమ్మీద ఈ వ్యవహారానికి ఫుల్‌స్టాప్ ఎప్పుడు పడుతుందో కానీ మాటల తూటాలు పేల్చుకుంటూనే ఉన్నాయి రెండు పార్టీలు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments