Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరును దగ్గర చేసేసుకుంటున్నారు... ధృవ ఫ్లెక్సీలలో నారా లోకేష్‌, చిరంజీవి ఫోటోలు!

కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరంజీవి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం కాస్త ఆలస్యమవుతున్నా.. ఆయన చేరిక మాత్రం దాదాపు ఖాయమనే తెలుస్తోంది. ఇప్పటికే నారా లోకేష్‌ చేసిన సంప్రదింపులకు సిద్ధమైన చిరంజీవి తెదేపా తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయం కూడా తీ

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2016 (14:43 IST)
కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరంజీవి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం కాస్త ఆలస్యమవుతున్నా.. ఆయన చేరిక మాత్రం దాదాపు ఖాయమనే తెలుస్తోంది. ఇప్పటికే నారా లోకేష్‌ చేసిన సంప్రదింపులకు సిద్ధమైన చిరంజీవి తెదేపా తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయం కూడా తీసేసుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
 
అయితే 150వ చిత్రంలో బిజీగా ఉన్న చిరంజీవి కాస్త ఆలస్యంగానే చేరాలన్న నిర్ణయంలో ఉన్నట్లు సమాచారం. అయితే అంతలోనే చిరంజీవి తెదేపాలో చేరిపోయినట్లుగా ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. చిరు కుమారుడు నటించిన ధృవ సినిమా ఫ్లెక్సీలో చిరంజీవి ఫోటో పక్కనే నారా లోకేష్‌ ఫోటో పెట్టడం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఎపిలోని చాలా ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీలో కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దగా పట్టించుకోకపోయినా చిరు అభిమానులు మాత్రం ఆలోచనలో పడ్డారు.
 
తెదేపా తీర్థం పుచ్చుకోకముందే ఈ ఫ్లెక్సీలలో కొంతమంది అభిమానులు ఇలాంటి ఫోటోలు పెట్టడం ఏమిటని మాట్లాడుకుంటున్నారు. నారా లోకేష్‌ ఇప్పటికే సంప్రదింపులు జరిపారు కానీ.. ఆ తరువాత షూటింగ్‌ జరుగుతుండటం చిరు కాస్త బిజీగా ఉండటంతో లోకేష్‌ కూడా సైలెంట్‌ అయిపోయారు. కానీ ఈ మధ్యలో లోకేష్‌ చిరుతో ఒకసారి ఫోన్‌లో కూడా మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది. చిరు సినిమా విడుదలైన తరువాతనో లేకుంటే షూటింగ్‌ అయిపోయిన తరువాతనో పార్టీ తీర్థం పుచ్చుకోవాలన్న నిర్ణయానికి చిరు వచ్చేసిట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments