Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి పాదాల చెంత ప్రమాణం చేసిన నారా లోకేష్.. ఎందుకు?

శ్రీవారి పాదాల చెంత ప్రమాణం చేసిన నారా లోకేష్.. ఎందుకు?
Webdunia
బుధవారం, 14 ఏప్రియల్ 2021 (20:39 IST)
తిరుమల శ్రీవారి పాదాల చెంత ప్రమాణం చేశారు తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్సి నారా లోకేష్. వై.ఎస్. వివేకానందరెడ్డి హత్యకు.. తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేశారు. వందలాదిమంది కార్యకర్తల మధ్య తిరుపతిలోని గరుడ విగ్రహం ముందు బైఠాయించి ప్రమాణం చేశారు జగన్. 
 
జగన్ రెడ్డి.. తాడేపల్లి నుంచి తిరుపతికిరా. సరిగ్గా 45 నిమిషాలు హెలికాప్టర్‌‌లో రావడానికి. విమానాశ్రయంలో దిగి అలిపిరికి రా. ఇద్దరం కలిసి ప్రమాణం చేద్దాం. మీ బాబాయ్‌ని హత్య చేయించింది ఎవరో తెలుస్తుంది అని సవాల్ విసిరాడు నారా లోకేష్. సుమారు 40 నిమిషాల పాటు గరుడ సర్కిల్ ముందే కూర్చున్నారు.
 
రక్తచరిత్ర ఎవరిదో ప్రజలకు తెలుసునంటూ లోకేష్ మండిపడ్డారు. కత్తితో వచ్చినోడు ఆ కత్తితోనే పోతాడంటూ విమర్సించారు. నాపై నిరాధారమైన ఆరోపణలు చేశారు. వివేకా హత్యకు మాకేమైనా సంబంధం ఉందా అంటూ ప్రశ్నించారు. 
 
హత్యలో ప్రధాన సూత్రధారులు వై.ఎస్. అవినాష్ రెడ్డి, గంగిరెడ్డి, భాస్కర్ రెడ్డిలేనన్నారు. కుటుంబ కలహాలతో వాళ్ళే వివేకానంద రెడ్డిని హత్య చేశారని చెప్పారు. వై.ఎస్. వివేకా కుమార్తె సునీత కోర్టుకెళ్ళినా జగన్ ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు.
 
హత్యపై సిబిఐ విచారణ వెంటనే జరిపించాలని డిమాండ్ చేశారు. జగన్ మోహన్ రెడ్డికి దమ్ముంటే అలిపిరి వద్దకు రా... ప్రమాణం చేద్దామంటూ సవాల్ విసిరారు. ఉప ఎన్నికల సమయంలో నారా లోకేష్ తిరుపతిలోని అలిపిరి సర్కిల్ వద్ద ప్రమాణం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments