Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nara Lokesh: ఎమ్మెల్సీ ఎన్నికలు.. వార్ రూమ్‌ సిద్ధం చేయండి.. నారా లోకేష్

సెల్వి
సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (22:40 IST)
ఆంధ్రప్రదేశ్ విద్య- ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, జంట గోదావరి జిల్లాలు, కృష్ణ-గుంటూరు ప్రాంతానికి జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు మొదటి ప్రాధాన్యత ఓట్ల ద్వారా నిర్ణయాత్మక విజయం సాధించాలని ఉద్ఘాటించారు.
 
ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ సీనియర్ నాయకులతో నారా లోకేష్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రచార సమయం పరిమితంగా ఉండటం వల్ల ప్రతి ఓటరును చేరుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని సమావేశంలో లోకేష్ పేర్కొన్నారు. 
 
పోలింగ్ రోజు పార్టీ ఇన్‌ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు ఓటర్లు పోలింగ్ బూత్‌లను సందర్శించి తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూసుకోవాలని నారా లోకేశ్ హైలైట్ చేశారు.
 
ఎన్నికల రోజు కార్యకలాపాలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించడానికి, లోకేశ్ కేంద్ర కార్యాలయంలో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. పార్టీ అభ్యర్థులకు అద్భుతమైన విజయాన్ని సాధించడానికి అన్ని కూటమి నాయకులు సమిష్టిగా పనిచేయాలని నారాలోకేష్ కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినీ బృందం (video)

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments