Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోకేష్ బ్యాంక్... బ్రాహ్మణి లిమిటెడ్.. బిటెక్ ప్రశ్నాపత్రంలో బాబుగారి కుటుంబం

కాకినాడ ‌: నారా లోకేష్ బ్యాంకు ఎప్పుడు పెట్టారా అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? లేదండి... ఇది కాకినాడ జెఎన్‌టియులో చదువుతున్న ఇంజీనిరింగ్ విద్యార్థులకు ఎదురైన చిత్రమైన ప్రశ్న‌. ఇంజ‌నీరింగ్ ప్ర‌శ్నాప‌త్రంలో ఏపి ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, వ

Webdunia
బుధవారం, 2 నవంబరు 2016 (15:33 IST)
కాకినాడ ‌: నారా లోకేష్ బ్యాంకు ఎప్పుడు పెట్టారా అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? లేదండి... ఇది కాకినాడ జెఎన్‌టియులో చదువుతున్న ఇంజీనిరింగ్ విద్యార్థులకు ఎదురైన చిత్రమైన ప్రశ్న‌. ఇంజ‌నీరింగ్ ప్ర‌శ్నాప‌త్రంలో ఏపి ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, వారి కుటుంబ సంస్థ హెరిటేజ్‌ల ప్రస్తావన రావ‌డం విద్యార్థుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. 
 
మేనేజేరియల్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్సియల్ ఎనాలిసిస్ (ఎమ్‌ఈఎఫ్ఏ) పరీక్ష ప్రశ్నాపత్రంలో జర్నల్ ఎంట్రీ రికార్డింగ్ విధానానికి సంబంధించి అడిగిన ఓ ప్రశ్నలో లోకేష్ బ్యాంక్, హెరిటేజ్ లిమిటెడ్, బ్రాహ్మణి లిమిటెడ్ అంటూ ప్రశ్నాపత్రం తయారుచేసిన వారు చంద్రబాబు కుటుంబ పల్లవి అందుకున్నారు. 
 
వేరే పేర్లు లేనట్లు ముఖ్యమంత్రి కుటుంబం, వారి పేర్లు, సంస్థ గురించి ప్రశ్నాపత్రంలో ప్రస్తావించడం నివ్వెర‌ప‌ర‌చింది. అంటే ఇదంతా తెలుగుదేశం పార్టీ అనుకూల ప్రొఫెసర్‌ల అతిభక్తి కావొచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రశ్నాపత్రంలో అలాంటి ప్రశ్నలు ఉంచడం వెనుక ప్రత్యేకంగా ఎలాంటి ఉద్దేశం లేదని జెఎన్టియు వైస్ ఛాన్సిల‌ర్ వివరణ ఇచ్చార‌నుకోండి. ఐనా దీనిపై చర్చలు రకరకాలుగా జరుగుతున్నాయనుకోండి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments