Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు : నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2023 (16:23 IST)
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తన పేరును ఏ14గా చేర్చడంతో ముందస్తు బెయిల్ కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగే అవకాశం ఉంది. అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతల భూముల విలువను పెంచేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్‌ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్చారని వైకాపా ప్రభుత్వం ఆరోపిస్తుంది. 
 
ఈ కేసులో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి పి.నారాయణ, లింగమనేని రమేశ్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, ఆర్కే హౌసింగ్ లిమిటెడ్‌కు చెందిన అంజనీ కుమార్, హెరిటేజ్ ఫుడ్స్, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు పలువురుని ఎఫ్ఐఆర్‌‍లో చేర్చింది. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ కోరుతూ లోకేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
చంద్రబాబు మరికొన్ని రోజులు జైల్లోనే ... సుప్రీంకోర్టులోనూ నిరాశ...  
 
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మరికొన్ని రోజులు జైలు జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనపై బనాయించిన అక్రమ కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు అక్టోబరు మూడో తేదీకి వాయిదా వేసింది. శుక్రవారం నుంచి అక్టోబరు రెండో తేదీ వరకు సుప్రీంకోర్టుకు సెలవులు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ పిటిషన్‌ బుధవారం విచారణకు రాగా, ద్విసభ్య ధర్మాసనం నుంచి జడ్జి ఎస్వీ భట్టి తప్పుకున్నారు. ఆయన నాట్ బిఫోర్ మీ తీసుకున్నారు. దీంతో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి ముందు సిద్ధార్థ్ లూథ్రా మళ్ళీ మెన్షన్ చేశారు. ఈ పిటిషన్‍‌ను తక్షణమే లిస్టింగ్ చేయాలని సీజేఐని కోరారు. త్వరగా లిస్ట్ చేయలానేది తమ మొదటి అభ్యర్థన అని, చంద్రబాబు మధ్యంతర ఉపశమనం కలిగించాలన్నది రెండో అభ్యర్థన అని లుథ్రా విన్నవించారు. 
 
17ఏ అనేది కేసు మూలల నుంచి వచ్చించాల్సిన అంశమని లూథ్రా చెప్పారు. చంద్రబాు బెయిల్ ఇవ్వాలని తాము కోరుకోవడం లేదని చప్పారు. పోలీసు కస్టడీ నుంచి మినహాయింపు కోరుతున్నామని చెప్పారు. జడ్ కేటగిరీ, ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఇలా ట్రీట్ చేస్తారని ప్రశ్నించారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయమని చెప్పారు. యశ్వంత్ సిన్హా కేసులో వ్యక్తి స్వేచ్ఛపై అన్ని విషయాలను పొందుపరిచారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments