Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్‌కు ఆ క్వాలిటీస్ లేవు.. అందుకే కేంద్ర మంత్రిగా..?!

Webdunia
బుధవారం, 25 నవంబరు 2015 (15:12 IST)
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు ఎంపీ పదవి అంటగట్టాలని తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నారా లోకేష్‌కు రాజకీయాల్లో వుండాల్సిన సరైన లుక్ కానీ, ప్రజాసేవ నేపథ్యంగానీ లేకపోవడంతో ఎంపీ పదవి ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నారట. ఏమాత్రం రాజకీయాలకు పనికిరాని లోకేశ్‌ను ఈ స్థాయికి తీసుకురావడానికి చంద్రబాబు బాగానే కష్టపడినట్టు సమాచారం. 
 
మొదట పార్టీ యువ నేతగా, ఆ తర్వాత పార్టీ సంక్షేమ నిధి కన్వీనర్‌గా ప్రమోట్ చేసి.. ఏకంగా ఒక్కసారిగా పార్టీ జాతీయ కార్యదర్శి పదవిని కట్టబెట్టారు. ప్రస్తుతం ఉన్నట్టుండి నారా లోకేష్‌ను కేంద్రమంత్రిని చేయాలనే ఆలోచన బాబుకు వచ్చిందని తెలుస్తోంది. లోకేశ్‌ను కేంద్రమంత్రిని చేస్తే రాష్ట్ర రాజకీయాలకు దూరమైపోరా అనుమానం కలిగినా, దూరమైతే.. 2019 నాటికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎలా ఫోకస్ చేస్తారు. 
 
అయితే ప్రజల్లో నారా లోకేష్‌కు అంత క్రేజ్ లేకపోవడంతో ఢిల్లీకి పంపించేయాలనుకుంటున్నారట. ప్రస్తుతం కేబినెట్ మంత్రిగా ఉన్న అశోక్ గజపతిని తప్పిస్తారని ఎప్పటి నుంచో వార్తలున్నాయి. ఇప్పుడు అశోక్‌ను తప్పించి లోకేశ్‌కు ఆ పదవి కట్టబెడతారని తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments