Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత బాబాయిని చంపించిన జగన్.. మరింత మందిని చంపేందుకు సిద్ధమా? నారా లోకేశ్ ప్రశ్న

ఠాగూర్
సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (11:29 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత బాబాయిని చంపించిన జగన్.. మరింతమందిని చంపేందుకు సిద్ధమా? అంటూ ఆయన ప్రశ్నించారు. శ్రీకాకుళంలో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. "జగన్ రెడ్డి తన సొంత బాబాయిని చంపేశారు. మరింతమంది కుటుంబ సభ్యులను చంపేందుకు ఆయన సిద్ధమా?, రాష్ట్రాన్ని కూడా నాశనం చేయాలని అనుకుంటున్నారా? అని జగన్‌ను సూటిగా ప్రశ్నిస్తున్నా అని అన్నారు. రాష్ట్రాన్ని గంజాయికి రాజధానిగా చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా గంజాయి వాసనే వస్తుందన్నారు. 
 
కాగా, గత 2019లో తన సొంత స్వగ్రామమైన పులివెందులలో మాజీ మంత్రి, జగన్ బాబాయి వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారని, జగన్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం తన తండ్రిని అకారణంగా 53 రోజుల పాటు అక్రమంగా జైల్లో పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లలో టీడీపీ కార్యకర్తలపై పలు కేసుపెట్టారని, తన ఒక్కడిపైనే అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నంతో కలిపి 22 కేసులు పెట్టారని తెలిపారు. గత నాలుగేళ్లుగా అధికార వైకాపాకు తొత్తులుగా వ్యవహరించిన, వ్యవహరిస్తున్న అధికారుల పేర్లను రెడ్ బుక్‌లో రాస్తున్నానని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ - జనసేన ప్రభుత్వం ఏర్పాటయ్యాక వారంతా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నారా లోకేష్ హెచ్చరించారు. 

బిడ్డలను కంటే రూ.62 లక్షలు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన కంపెనీ.. 
 
ప్రపంచంలోని పలు దేశాల్లో జననాల రేటు గణనీయంగా పడిపోతుంది. ఇప్పటికే చైనా దేశంలో ఈ పరిస్థితి అధికంగా ఉంది. దీంతో చైనా ప్రభుత్వం ఇంతకాలం అమలు చేస్తూ వచ్చిన కుటుంబ నియంత్రణను ఎత్తివేసింది. తమ దేశ పౌరులు ఎంతమందినైనా కనొచ్చని ప్రకటించింది. గతంలో ఒక్కరికి మించి సంతానం కనేందుకు వీలులేదు. కానీ ఇపుడు ఈ నిబంధన ఎత్తివేసింది. ఇలా.. జననాల రేటు పడిపోతున్న దేశాల్లో ఇపుడు దక్షిణ కొరియా కూడా చేరింది. దీంతో ఈ జనన రేటును పెంచుకునేందుకు ఈ దేశానికి చెందిన ఓ కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రముఖ నిర్మాణ రంగ కంపెనీ బూయంగ్ ఉద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించింది. 
 
పిల్లల్ని కన్న ప్రతి సారీ రూ.62.54 లక్షలు (100 మిలియన్ కొరియన్ వాన్లు) చెల్లిస్తామని ప్రకటించింది. 2021లో 70 మంది పిల్లకు జన్మనిచ్చిన ఉద్యోగులకూ రూ.43.77 లక్షలు చెల్లించాలని యోచిస్తుంది. ముగ్గురు పిల్లలున్న ఉద్యోగులకు రూ.1.86 కోట్ల లక్షల నగదు లేదా ఇంటి అద్దె సదుపాయాన్ని కల్పించాలని భావిస్తుంది. ఈ ఆఫర్లు ఆడ, మగ ఉద్యోగులిద్దరికీ వర్తిస్తాయని పేర్కొంది. 2022లో ప్రపంచంలో అతి తక్కువ సంతానోత్పత్తి రేటు దక్షిణ కొరియాలోనే నమోదు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments