Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలూ... కత్తులు.. చాకులు వెంటపెట్టుకోండి.. అలాంటివారి మర్మాంగాలు కోసెయ్యండి : నన్నపనేని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేట‌ప్పుడు అమ్మాయిలు తమ వెంట క‌త్తులు, చాకులు వెంట‌పెట్టుకుని వెళ్లాల‌ని సూచించారు.

Webdunia
బుధవారం, 24 మే 2017 (15:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేట‌ప్పుడు అమ్మాయిలు తమ వెంట క‌త్తులు, చాకులు వెంట‌పెట్టుకుని వెళ్లాల‌ని సూచించారు. అంతేకాకుండా, కామంతో కళ్లుమూసుకునిపోయి అత్యాచారానికి పాల్పడే పురుషుల మర్మాంగాలను కోసెయ్యాలని ఆమె పిలుపునిచ్చారు. 
 
విశాఖపట్టణంలో అత్యాచార బాధితులను ఆమె బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అమ్మాయిలు, మహిళలు తమ రక్షణార్థం కత్తులు, చాకులు తీసుకెళ్లాలని సూచించారు. ఒకవేళ పురుషులు ఎవరైనా అత్యాచానికి ప్రయత్నిస్తే వారి మర్మాంగాన్ని కోసిపారెయ్యాలని ఆమె సూచించారు. 
 
కేర‌ళ‌లో ఓ అమ్మాయి త‌న‌పై అత్యాచారానికి పాల్ప‌డుతున్న‌ ఓ బాబా మ‌ర్మాంగాన్ని కోసేసింద‌ని, ఆ రాష్ట్ర సీఎం ఆమెపై కేసు లేకుండా చేశార‌ని గుర్తు చేశారు. త‌మ వెంట‌ప‌డి అకృత్యాల‌కు పాల్ప‌డే వారి పట్ల అమ్మాయిలు ఆ కేరళ యువతిలాగే ప్రవర్తించాలని పిలుపునిచ్చారు. అమ్మాయిలు చాలా జాగ్ర‌త్తగా ఉండాల‌ని సోష‌ల్ మీడియాలో అబ్బాయిల‌తో ప‌రిచ‌యాలు పెంచుకొని మోసపోవ‌ద్ద‌ని హితవు పలికారు. త‌మ వెంట ప‌డే వారిపై మాత్రం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించి, ఎదురుతిర‌గాల‌ని నన్నపనేని రాజకుమారి పిలుపునిచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Vishnu: శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ చిత్రం డేట్ ప్రకటన

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments