Webdunia - Bharat's app for daily news and videos

Install App

భావోద్వేగాలతో ముడిపడిన అంశం : 'ఎన్టీఆర్' పేరు మార్పుపై కళ్యాణ్ రామ్

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2022 (19:58 IST)
కేవలం రాజకీయ లాభం కోసం అనేక మంది భావోద్వేగాలతో ముడిపడివున్న ఈ అంశాన్ని వాడుకోవడం తప్పు అని సినీ హీరో, ఎన్టీఆర్ మనవడు నందమూరి కళ్యాణ్ రామ్ అన్నారు. 
 
విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీగా పేరు మార్చుతూ సీఎం జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో ఓ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించింది. ఈ నిర్ణయాన్ని అనేక మంది తీవ్రంగా తప్పుబడుతున్నారు. 
 
ఈ పేరు మార్పుపై ఇప్పటికే  హీరో జూనియర్ ఎన్టీఆర్ తప్పుబట్టారు. పేరు మార్చినంత మాత్రాన గౌరవం, స్థాయి పెరగదంటూ సుతిమెత్తగా చురకలు అంటించారు. 
 
ఇపుడు ఆయన అన్న నందమూరి కళ్యాణ్ రామ్ స్పందించారు. 1986లో ఈ వైద్య కాలేజీని స్థాపించారన్నారు. ఏపీలోని మూడు ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందుబాటులోకి తీసుకుని రావాలన్న ఏకైక లక్ష్యంతో ఎన్టీఆర్ ఈ మహా విద్యాలయానికి అంకురార్పణ చేశారన్నారు. 
 
ఈ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చెంది లెక్కనేంత మంది వైద్య నిపుణులను దేశానికి అందించిందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో వైద్య అధ్యయనాలు మెరుగుదలకు ఆయన చేసిన కృషిని స్మరించుకునేందుకు ఈ విశ్వవిద్యాలయానికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని పేరు పెట్టారని గుర్తుచేశారు. 
 
ఆ తర్వాత రాష్ట్రంలో ఏ రాజకీయా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ గత 25 యేళ్లకు పైగా ఉనికిలో ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం పేరు మార్చలేదన్నారు. కానీ, ఇపుడు ఏవో రాజకీయ స్వలాభాల కోసం అనేక మంది భావోద్వేగాలతో ముడిపడివున్న ఈ అంశాన్ని వాడుకోవడం తప్పు అని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments