హరికృష్ణ కుమారుడు నందమూరి జానకీ రామ్ రోడ్డు ప్రమాదంలో మృతి...

Webdunia
శనివారం, 6 డిశెంబరు 2014 (20:39 IST)
తెలుగుదేశం పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు, నటుడు నందమూరి హరికృష్ణ కుటుంబంలో శనివారంనాడు విషాదం చోటుచేసుకుంది. హరికృష్ణ పెద్ద కుమారుడయిన జానకి రామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ రోడ్డు ప్రమాదం హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదకర రోడ్డు మలుపులో రాంగ్ రూట్‌లో వచ్చిన ట్రాక్టర్‌ ఢీకొనడంతో దుర్ఘటన చోటుచేసుకుంది.
 
ప్రమాదం జరిగిన సమయంలో కారులో జానకిరామ్‌తోపాటు కారు డ్రైవర్ కూడా ఉన్నారు. కానీ కారును మాత్రం జానకిరామ్ నడుపుతున్నట్టు చెపుతున్నారు. కాగా కారు ప్రమాదానికి గురైన మలుపు చాలా ప్రమాదకరమైన మలుపు అనీ, ఈ మలుపులో గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయనీ ప్రత్యక్ష సాక్షుల కథనం. నందమూరి జానకిరామ్ కారు ఈ ప్రమాదకర మలుపు వద్దకు వచ్చినప్పుడు రాంగ్ రూట్‌లో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ జానకిరామ్ కారును ఢీకొన్నట్లు చెపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

Show comments