Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద‌మూరి బాల‌య్య కొత్త సినిమా షురూ... శృతి హాస‌న్ హీరోయిన్!

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (14:59 IST)
నందమూరి బాల‌కృష్ణ కుర్ర హీరోలా ఒక సినిమా కాగానే మ‌రో సినిమా చేసుకుపోతున్నారు. ఇటీవ‌ల ‘అఖండ’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన నంద‌మూరి బాల‌కృష్ణ, ఇప్పుడు గోపీచంద్ మ‌లినేని మూవీలో సినిమా మొద‌లుపెట్టేశారు. ‘క్రాక్’ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన గోపీచంద్ మ‌లినేని బాల‌కృష్ణ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టు స్టోరిని డెవ‌ల‌ప్ చేశాడ‌ట‌. దీనితో ఆ సినిమా క్లాప్ కొట్టేశారు.
 
 
ఈ సినిమాలోనూ బాల‌య్య డ్యూయెల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నార‌ట‌. ఇప్పుడు అఖండ సినిమాలో డ‌బుల్ రోల్‌లో మెప్పించ‌నున్న మ‌రోసారి అలాగే అల‌రించ‌బోతున్నాడ‌ట‌. ఈ కొత్త సినిమాలో ఓ పాత్ర‌లో ఫ్యాక్ష‌నిస్ట్‌గా, మ‌రో పాత్ర‌లో స్వామిజీగా బాల‌య్య అల‌రించ‌బోతున్నాడు. పుల్ మాస్ మసాల కమర్షియల్ అంశాలతో రాబోతోన్న బాలయ్య చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. ఈ మూవీ ఇప్ప‌టికే పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. బాలకృష్ష సరసన శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

 
త‌న‌కు డ్యూయ‌ల్ రోల్ క‌లిసి వ‌చ్చింద‌ని బాల‌య్య భావిస్తున్నారు. అందుకే ఈ మ‌ధ్య ప్ర‌తి సినిమాలో రెండు క్యారెక్ట‌ర్లు, వెరైటీ డైమెన్ష‌న్ల‌లో చేసేస్తున్నారు. ఈ కొత్త సినిమా పూజా కార్య‌క్ర‌మంలో బుచ్చిబాబు, బోయ‌పాటి, వివి వినాయ‌క్, కొర‌టాల శివ, హ‌రీష్ శంక‌ర్, బాబీ త‌దిత‌రులు పూజా కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. వ‌చ్చే నెల‌లో షూటింగ్ మొద‌లు కానున్న‌ట్టు తెలుస్తుంది. వాస్తవ ఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ కథను రాశారు.


గోపీచంద్ మలినేని ఇటీవల `క్రాక్‌` సినిమాతో విజయాన్ని అందుకున్నారు. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా కరోనా సమయంలోనూ విడుదలై మంచి విజయం సాధించింది.  మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమా అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. పరాజయాల్లో ఉన్న రివితేజకి మంచి విజయాన్ని అందించి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. మరోవైపు గోపీచంద్‌ మలినేనికి కూడా మంచి పేరు వ‌చ్చింది. ఈ ఊపుతో ఇపుడు బాల‌య్య సినిమా చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments