Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాంబారు పాత్రలో పడి ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి.. నల్గొండలో దారుణం

సాంబారు పాత్రలో పడి ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. మధ్యాహ్న భోజనం సమయంలో సాంబారు పాత్రలో పడి గాయపడిన విద్యార్థి శనివారం మృతి చెందాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా కట్టంగూర

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2016 (12:05 IST)
సాంబారు పాత్రలో పడి ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. మధ్యాహ్న భోజనం సమయంలో సాంబారు పాత్రలో పడి గాయపడిన విద్యార్థి శనివారం మృతి చెందాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈదులూరు గ్రామానికి చెందిన బల్కూరి జయవర్ధన్(5) ఒకటో తరగతి చదువుతున్నాడు. 
 
శుక్రవారం మధ్యాహ్న భోజనం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులంతా వరుసలో నిలుచున్నారు. ఈ క్రమంలో వెనుకనున్న విద్యార్థులు తోసుకోవడంతో ముందున్న జయవర్ధన్ వేడి సాంబారు ఉన్న పాత్రలో పడిపోయాడు. దీంతో తీవ్రగాయాలైన ఆ విద్యార్థిని విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించారు. పరిస్థితి విషమించడంతో నల్గొండ ప్రభుత్వాసుపత్రి నుంచి హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శనివారం విద్యార్థి మృతి చెందాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments