Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ప్లాన్: సింగపూర్ తలదన్నేలా రాజధాని నిర్మాణం!

Webdunia
బుధవారం, 18 జూన్ 2014 (11:00 IST)
సింగపూర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కా ప్లాన్ వేస్తున్నారు. సింగపూర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి టెక్నికల్ సహకారం అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 
 
మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నివాసంలో సింగపూర్ కాన్సుల్ జనరల్ రాయ్, మరికొందరు అధికారులను కలిశారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఆహ్వానం మేరకు వారు వచ్చారు. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్‌లో ఉన్న అత్యుత్తమ కన్సల్టెన్సీ ఏమిటని చంద్రబాబు వారిని అడిగినట్లుగా సమాచారం. రాష్ట్ర అవసరం ఏమిటని సింగపూర్ అధికారులు చంద్రబాబును అడిగారట.
 
శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు తమ రాష్ట్రం విస్తరించి ఉందని, అందరికీ అందుబాటులో ఉండేలా ఒక రాజధాని నిర్మాణం చేయడం తమ లక్ష్యమని చంద్రబాబు వారికి చెప్పారు. 
 
ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజధానిని సింగపూర్ తలదన్నేలా నిర్మించాలని చంద్రబాబు పక్కా ప్లాన్ వేస్తున్నారు. ఎక్కడ ఏర్పాటు చేసినా అత్యుత్తమమైనదిగా నిర్మిస్తామని, ఇందుకోసం సింగపూర్, మలేషియా తరహాలో నగరాల అభివృద్ధికి ఆలోచన చేస్తున్నామని మంత్రి పి నారాయణ చెప్పారు.

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

Show comments