Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘనంగా తన పుట్టిన రోజు జరుపుకున్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (15:00 IST)
అటు సినిమాల్లో ఇటు రాజకీయంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు రోజా. ఆమె నేడు తన 48వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు సినిమా సెలబ్రిటీలు, రాజకీయనేతలు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
 
గత రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నారు రోజా. దీనికి సంబంధించిన ఫోటోలను రోజా సోషల్ మీడియా ద్వారా షేర్ చెయ్యగా ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
 
రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి. 1972వ సంవత్సరం నవంబరు 17న నాగరాజు రెడ్డి, లలిత దంపతులకు చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో రోజా జన్మించారు. ప్రేమ తపస్సు సినిమాలో పీరోయిన్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి పేరు తెచ్చుకుంది.
 
ఆ తర్వాత తమిళ, తెలుగు సీనియర్ హీరోలతో పలు సినిమాలు చేసి ప్రశంసలు అందుకున్నారు. రోజా తమిళ దర్శకుడు ఆర్ కే సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న రోజా పలు షోలకు మాత్రం జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments