ప్రజాగళం సభలో పోలీసుల తీరుపై అనుమానం... ఈసీకి ఫిర్యాదు చేస్తాం : నాదెండ్ల మనోహర్

ఠాగూర్
సోమవారం, 18 మార్చి 2024 (14:32 IST)
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని బొప్పూడిలో ఆదివారం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో జరిగిన ప్రజాగళం సభలో పోలీసులు వ్యవహరించిన తీరుపై జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సోమవారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశ ప్రధాని సభకు జిల్లా అధికారులు బ్లాంక్‌ పాసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. నేతల సహకారంతో సభ విజయవంతంగా జరిగిందని తెలిపారు. పొత్తుల్లో భాగంగా సీట్లు ఆశించి రాని వారికి భవిష్యత్తులో న్యాయం చేస్తామని చెప్పారు.
 
'పవన్ కల్యాణ్ నాలుగేళ్ల కృషికి నిన్నటి సభతో ఫలితం వచ్చింది. త్వరలోనే ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. మూడు పార్టీల కలయిక ప్రజలకు మేలు చేస్తుంది. వైకాపా అవినీతిని ప్రధాని నరేంద్ మోడీ ప్రజల ముందు ఉంచారు. సంక్షేమం, అభివృద్ధి నినాదంతో ముందుకెళ్తాం. పోలీసుల నిర్లక్ష్యం వల్ల సభలో చాలా ఇబ్బందులు వచ్చాయి. దీనిపై ఎన్నికల అధికారికి సాయంత్రం 4 గంటలకు ఫిర్యాదు చేస్తాం' అని నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.
 
బొప్పూడి ప్రజాగళం సభలో వైకాపాపై ఉన్న ప్రజాగ్రహం స్పష్టంగా కనిపించిందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. వైకాపాను ఓడించాలనే కసితోనే ప్రజలు భారీగా తరలివచ్చారన్నారు. ప్రధాని సభకు సరైన భద్రత కల్పించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. పార్కింగ్‌ ప్రదేశాలున్నా పోలీసుల వైఫల్యంతో ట్రాఫిక్‌ జామ్‌ అయిందన్నారు. 
 
పోలీసుల తీరును తప్పుబడుతూ ప్రజలకు ప్రధానే విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. సభలో భద్రతా వైఫల్యాలపై సీఈసీ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. వైకాపా ప్రభుత్వ దోపిడీ వల్ల ఏపీ అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు. ఏపీ అభివృద్ధికి సంపూర్ణంగా కట్టుబడి ఉన్నామని మోదీ చెప్పారని ధూళిపాళ్ల నరేంద్ర గుర్తు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

హాలీవుడ్ లో మూవీస్ హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు : అను ఇమ్మాన్యుయేల్

నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం : సిట్ ముందుకు విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments