Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులకు అండగా కూటమి ప్రభుత్వం : నాదెండ్ల

ఠాగూర్
మంగళవారం, 3 డిశెంబరు 2024 (12:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  రైతాంగానికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఏపీ పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా వారీగా రైతులకు చెల్లించిన డబ్బుల వివరాలను ఆయన ఎక్స్ ఖాతా వేదికగా వివరించారు. 
 
గత జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ సమయానికి సేకరించిన ధాన్యం 4.43 మెట్రిక్‌ టన్నులని.. బాధ్యతతో కూటమి ప్రభుత్వం సేకరించిన ధాన్యం 9.14 మెట్రిక్‌ టన్నులన్నారు. వాస్తవ లెక్కలు చూస్తే జగన్‌ నిర్వాకం తెలుస్తోందన్నారు. సేకరించిన 24 గంటల్లో రైతు ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నామని తెలిపారు. రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా వివరాలను వెల్లడించారు. 
 
బెయిలిచ్చిన మరుసటి రోజే మీరు మంత్రి అయ్యారు.. ఏం జరుగుతోంది? : సుప్రీంకోర్టు 
తమిళనాడు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి సెంథిల్ బాలాజీ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మేం బెయిల్ ఇచ్చిన మరుసటి రోజే మీరు మంత్రి అయ్యారు.. ఏం జరుగుతోంది అంటూ న్యాయమూర్తి అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. 
 
క్యాష్ ఫర్ జాబ్ కేసులో మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్టు అయ్యారు. సుధీర్ఘకాలం పాటు జైలులో ఉన్న సెంథిల్ బాలాజీకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన చెన్నై సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసీ సారథ్యంలోని ధర్మాసన విచారణ చేపట్టింది. 
 
మేం ఇలా బెయిల్ ఇచ్చామో లేదో అలా మీరు మంత్రి అయిపోయారు. ఇపుడీ కేసులో సాక్షుల పరిస్థితి ఏంటి? మీరు మంత్రి హోదాలో అధికార పీఠంపై ఉన్నందున సాక్షుల్లో ఆందోళన నెలకొనదా? అని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. 
 
అయితే, సెంథిల్ బాలాజీ బెయిల్‌పై పునరాలోచన లేదని, అతడి బెయిల్ రద్దు చేయబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. కానీ సాక్షుల ఆందోళనకు గురవుతారన్న అంశాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకుంటామని, ఈ అంశం వరకు విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం