Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్దస్త్‌’ కి జ‌డ్జిగా వ‌స్తాన‌న్న నంద‌మూరి బాల‌కృష్ణ‌... రోజా ఫోన్!

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (13:36 IST)
జబర్దస్త్‌’ ప్రోగ్రాం నుంచి నంద‌మూరి బాల‌కృష్ణ‌కు సినీ నటి రోజా ఫోన్ చేసి మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను ఆ కార్య‌క్ర‌మ నిర్వాహ‌కులు విడుద‌ల చేశారు. ‘జబర్దస్త్‌’ వేదిక నుంచి బాల‌కృష్ణ‌కు రోజా ఫోన్ చేయ‌డంతో ఆ ప్రోగ్రాంలోని వారంతా సంబ‌ర‌ప‌డిపోయారు.
 
త‌మ‌ అందరి సమక్షంలో బాలకృష్ణకు కాల్‌ చేయండ‌ని రోజాను అనసూయ కోరింది. అయితే, బాల‌కృష్ణ ఈ స‌మ‌యంలో మంచి మూడ్‌లో ఉంటే ఓకే. లేకపోతే ఎలా? అని రోజా ప్ర‌శ్నిస్తూనే ఫోన్ చేసింది. బాలయ్య ఫోన్ ఎత్తారు. దీంతో 'హలో సర్‌.. బాగున్నారా?' అని రోజా పలకరించారు. బదులిస్తూ 'రోజాగారు నమస్కారం' అన్నారు బాలకృష్ణ. తాను బాగున్నాన‌ని, మన అఖండ షూట్‌లో ఉన్నానని ఆయన చెప్పారు. 
 
మళ్లీ మనిద్దరం కలిసి ఎప్పుడు సినిమా చేద్దామ‌ని బాల‌య్య‌ను రోజా ప్ర‌శ్నించారు. 'భైరవద్వీపం పార్ట్ 2 చేద్దామా? లేక బొబ్బిలిసింహం పార్ట్ 2 చేద్దామా?' అన్నారు రోజా. దానికి బాలయ్య నవుడుతూ, త‌మ‌ కాంబినేషన్‌ కోసం అందరూ ఎదురుచూస్తున్నారని చెప్పారు. ‘జబర్దస్త్‌’ ప్రోగ్రాంకు జడ్జీగా తాను వస్తానని బాల‌కృష్ణ అన‌డంతో అంద‌రూ ఖుషీ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments