Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్ బాబు : యాక్టివ్‌గా మారిన చంద్రన్న

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (09:18 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌లో తన జోరు కొనసాగిస్తున్నారు. ప్రధాన అంశాలపై ఆయన వరుస ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాకుండా, తనను లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు చేసే విమర్శలకు సైతం ముందుగా ట్వీట్టర్‌ ద్వారా కౌంటర్ ఇస్తున్నారు. ఆ తర్వాత ఏదేనీ బహిరంగ సభలో పూర్తిస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇపుడు వైకాపా, టీడీపీల మధ్య డేటా వార్ కొనసాగుతోంది. దీనిపై చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు. అవేంటో ఓసారి చూద్ధాం. 
 
* బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ మూడు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్‌లో చేయాల్సిన అరాచకాలన్నీ చేశాయి. ప్రజలు ఛీకొట్టేసరికి పలాయనం చిత్తగించాయి. ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో మకాం వేసి మనపై కుట్రలకు తెగబడ్డాయి. ఎవరెన్ని కుట్రలు పన్నినా, అరాచకాలు సృష్టించినా మేము వెనుకంజ వేయం.
 
* బీహార్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి వైసీపీకి కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. 8 లక్షల టీడీపీ ఓట్లను తొలగించారు. అందుకోసం ఫామ్‌-7 వినియోగించారు. చూస్తుంటే రేపు నా ఓటును కూడా తొలగిస్తారేమో. 
 
* ఆంధ్రప్రదేశ్ డేటాపై కేసులు పెట్టేందుకు తెలంగాణ పోలీసులు ఎవరు? ఎవరో దారిన పోయిన దానయ్య ఫిర్యాదు చేస్తే, డేటా ఉంది కదా అని ఇక్కడి ఐటీ కంపెనీలపై దాడి చేస్తారా? ఆంధ్రప్రదేశ్‌పై కుట్రలు చేస్తూ తెలంగాణ పోలీసులు కాపాడతారని డ్రామాలు చేస్తారా?
 
* డేటా పేరుతో దాడులు చేస్తే చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నారేమో, డేటా అనేది పార్టీ వ్యక్తిగత విషయం. అందులో తలదూర్చితే మీ అందరి మూలాలు కదులుతాయి. మీరు చేస్తున్న నేరాలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది జాగ్రత్త.
 
* కేంద్రంలా మాటల గారడీ చేసే ప్రభుత్వం కాదు.. సన్న, చిన్న అనే వ్యత్యాసం లేకుండా, కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ఇస్తోన్న ప్రభుత్వం మాది..
 
* రూ.1466 కోట్లతో తిరుపతి స్మార్ట్ సిటీ పనులకు శంకుస్థాపన చేశాం. దీని ద్వారా రూ.624 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్, భూగర్భ విద్యుత్ రూ.236 కోట్లు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, మునిసిపల్ స్కూళ్లను స్మార్ట్ కాంపస్‌లుగా తీర్చిదిద్దడం వంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం.
 
* నదుల అనుసంధానం కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డా. కుప్పం కంటే ముందుగా పులివెందులకు నీళ్లు ఇస్తామని చెప్పి, ఇచ్చిన మాట ప్రకారం నీళ్లిచ్చా. ఇప్పుడు రెండు కోట్ల ఎకరాలకు నీళ్లివ్వాలన్నదే నా లక్ష్యం. అదిసాకారమై, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మమ్మల్ని మళ్లీ గెలిపించాలి.
 
* మదనపల్లెలో చిప్పిలి చెరువు నీళ్లు వదలడం, హంద్రీనీవా జలాలకు జలహారతి పట్టడం అద్భుతం. ఒకప్పుడు ఈ ప్రాంతంలో నీటి సదుపాయం లేక వలసలు పోయే పరిస్థితి ఉండేది, అలాంటి స్థితి నుంచి ఇవాళ నిలదొక్కుకునే స్థితికి తీసుకొచ్చాం. భవిష్యత్తులో నీటి సమస్య అన్నది లేకుండా చేస్తాం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2: 23 ఏళ్ల ఖుషీ రికార్డును బ్రేక్ చేసిన పుష్ప 2.. టిక్కెట్ల తేడా వుందిగా..!?

ఫతే ప్రచారంలో సోనూ సూద్‌కి పంజాబ్ లో నీరాజనాలు

బాపు నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో చిత్రం

మెగాస్టార్ చిరంజీవి హిట్లర్ వాయిదా వేశారు కారణం..

ప్రభాస్ తో కలిసి వర్క్ చేయడం మర్చిపోలేని అనుభూతి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

తర్వాతి కథనం
Show comments