Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌కు మైసూరా రెడ్డి ఝులక్.. త్వరలో వైకాపాకు రాంరాం!!

Webdunia
ఆదివారం, 21 డిశెంబరు 2014 (13:11 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఆ పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి గట్టి షాక్ ఇవ్వనున్నారు. రాజ్యసభ టిక్కెట్ ఆశించి భంగపడిన మైసూరా రెడ్డి.. ఆ పార్టీకి రాజీనామా చేయాలన్న తలంపులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
వాస్తవానికి అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న జగన్ పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో ఆయన వైకాపాలో చేరారు. పార్టీ వ్యవహారాలతో పాటు అక్రమాస్తుల కేసులోనూ ఆయన జగన్‌కు పలు సలహాలు, సూచనలు చేశారు. అంతేకాకుండా, కడప జిల్లాలోనే కాక ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కూడా సీనియర్ రాజకీయవేత్తగా మైసూరా రెడ్డి ఎదిగారు. ఈయన.. వైకాపాకు క్రమంగా దూరమవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. 
 
కాంగ్రెస్, టీడీపీల్లో ఉన్న మైసూరా... భవిష్యత్తులో రాజ్యసభకు పంపుతామన్న జగన్ హామీతోనే వైకాపాలో చేరారని అపుడు వార్తలు వినిపించాయి. అయితే, ఇపుడు ఆ పార్టీ తరపున రాజ్యసభకు విజయసాయిరెడ్డిని ఎంపిక చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మైసూరా, త్వరలోనే జగన్ కు ఝలక్ ఇస్తారన్న వార్తలు జోరందుకున్నాయి. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments