Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెటిల్ చేస్తానని సీన్లోకి ఎంటరయ్యాడు... చివరకు సూసైడ్ చేసుకున్నాడు.. ఇదీ ఎస్ఐ కథ!

హైదరాబాద్ బ్యూటీషియన్‌కు ఆమె పని చేసే సంస్థ యజమానికి మధ్య ఉన్న మనస్పర్థలను పరిష్కరించేందుకు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఎంటరైనట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. మిస్టరీగా మారిన బ్యూటీషన్, ఎస్ఐ ఆత్మ

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (10:09 IST)
హైదరాబాద్ బ్యూటీషియన్‌కు ఆమె పని చేసే సంస్థ యజమానికి మధ్య ఉన్న మనస్పర్థలను పరిష్కరించేందుకు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఎంటరైనట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. మిస్టరీగా మారిన బ్యూటీషన్, ఎస్ఐ ఆత్మహత్య కేసులో పోలీసులు సగం మిస్టరీని ఛేదించారు. అయితే, శిరీష‌ను ఎస్ఐ రేప్ చేసి హత్య చేశాడా? లేక ఆమె స్వయంగా ఆత్మహత్య చేసుకుందా? ఎస్ఐ కూడా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అనేది ఇపుడు పోలీసులకు పెద్ద చిక్కుముడిగా మారింది. ఈ ముడిని విప్పే పనిలోనే పోలీసులు ఉన్నారు. 
 
హైదరాబాదులోని ఫిల్మ్ నగర్‌లో ఆర్జీఏ స్టూడియోలో మేకప్ ఆర్టిస్ట్‌గా శిరీష పని చేస్తూ వచ్చింది. ఈ స్టూడియో యజమాని రాజీవ్‌కు తేజస్విని అనే ప్రేయసి ఉంది. అయితే రాజీవ్ తన సంస్థలో పని చేసే శిరీషతో చనువుగా ఉంటున్నాడని, వారి బంధం నేపథ్యంలో తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని తేజస్విని అనుమానించింది. ఫలితంగా వారిద్దరి మధ్య విభేదాలు పొడచూపాయి. 
 
ఈ నేపథ్యంలో తమ సమస్యను పరిష్కరించాలని రాజీవ్ తన స్నేహితుడు శ్రావణ్‌ను ఆశ్రయించాడు. దీంతో శ్రావణ్ వారి మధ్య సమస్యను పరిష్కరించేందుకు తన స్నేహితుడు ఎస్ఐ ప్రభాకర్‌ రెడ్డిని రంగంలోకి దించాడు. అయితే, సెటిల్ చేస్తానని సీన్లోకి ప్రభాకర్ రెడ్డి ఎంటర్ కావడంతో పరిస్థితి మారిపోయింది. ఈ నేపథ్యంలో శిరీష, రాజీవ్, తేజస్విని, శ్రావణ్ హైదరాబాదుకు 71 కిలోమీటర్ల దూరం వెళ్లారు. అక్కడ పార్టీ చేసుకున్నారు. 
 
ఈ సందర్భంగా చోటుచేసుకున్న చర్చలు, లేదా ఇతర ఘటనల నేపథ్యంలో శిరీష తన భర్తకు లొకేషన్ షేర్ చేసింది. ఇంతవరకు జరిగింది తెలిసినా ఆ తరువాత ఏం జరిగిందన్నది మాత్రం మిస్టరీగా మారింది. అనంతరం చోటుచేసుకున్న ఘటనలే శిరీషది హత్యా? లేక ఆత్మహత్య?... శిరీషపై ఎస్సై ప్రభాకర్ అత్యాచారం చేశాడా? లేదా?... ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. అన్న వివరాలపై క్లారిటీ కోసం పోలీసులు విచారణ జరుపనున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments