Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్ర‌సాద్ ఫోటో ఎత్తేశారు....

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (14:33 IST)
వ‌సంత కృష్ణ ప్ర‌సాద్... ఇపుడు ఆయ‌న మైల‌వ‌రం వైసీపీ ఎమ్మెల్యే. కేపీ అని పిలిచే ఆయ‌న మాజీ హోం మంత్రి వ‌సంత నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడు. ఆయ‌న రాజ‌కీయ వార‌సుడిగా మొదట్లో మైలవరం నియోజకవర్గంలో కెపిని ఆకాశానికి ఎత్తేశాయి... వైసిపి శ్రేణులు.

 
గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ మంత్రి, సీనియ‌ర్ నాయ‌కుడు దేవ‌నేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుపై ఘన విజ‌యం సాధించిన కేపీకి ఇపుడు సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే అస‌మ్మ‌తి మొద‌లైంది. సరిగ్గా రెండున్నర ఏళ్లు తిరగక ముందే స్థానిక వైసీపీ నేత‌లు తమ బ్యానర్లలో నుండి ఏకంగా కెపి ఫోటోనే లేకుండా ఎత్తేశారు.

 
ఔరా ఏమిటి హతవిధీ అంటూ మైలవరం నియోజకవర్గంలో ప్ర‌జ‌లు ముక్కున వేలు వేసుకుంటున్నారు.  ఇదంతా మార్పులో భాగమా? లేక కెపి పైన వచ్చిన వ్యతిరేకతా? అంటే ఇదంతా వైసిపిలో కెపి పైన లేచిన అసమ్మతి కెరటంగానే భావిస్తున్నారు.

 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకల సాక్షిగా మైలవరంలో అస‌మ్మ‌తి సెగ గుప్పుమంది. ఇబ్రహీంపట్నంలో సైతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగానే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైలవరం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పామర్తి శ్రీనివాసరావు, వేములకొండ రాంబాబు, మండల కన్వీనర్ బొమ్మ సాని చలపతిరావు, రాష్ట్ర నాయకులు మేడపాటి నాగిరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు కోమటి కోటేశ్వరరావు, జి.కొండూరు జడ్పిటిసి మందా చక్రధరరావు తదితరులు పాల్గొన్నారు. 
 
 
ముఖ్యమంత్రి వైయస్ జగన్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు  ఫోటో లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది చూస్తే చాలదా? మైలవరం నియోజకవర్గం లో కెపి పైన అసమ్మతి సెగ ఏ మేర ఉందో అర్థం అవడానికి!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

Sudeep: కిచ్చా సుదీప్ పాన్ ఇండియా మూవీ మార్క్ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

ఉత్తర్ ప్రదేశ్ నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో నిశాంచి ట్రైలర్ విడుదల

Anupama : దెయ్యంలా వుంటావని అమ్మ తిడుతుండేది : అనుపమ పరమేశ్వరన్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

తర్వాతి కథనం
Show comments