Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లేనట్టే : మురళీ మోహన్

Webdunia
మంగళవారం, 27 జనవరి 2015 (10:40 IST)
విభజన చట్టం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం అంత సులభమైన విషయం కాదని తెలుగుదేశం పార్టీకి చెందిన రాజమండ్రి ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ అన్నారు. విభజన బిల్లుకు రాజ్యసభలో ఆమోదం తెలిపే సమయంలో ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టిన బీజేపీ ఎంపీ, రాష్ట్రనేత వెంకయ్య నాయుడే ఈ ప్రత్యేక హోదాపై సందేహం వ్యక్తం చేయడంతో ఆయన పల్లవిని అధికార టీడీపీకి చెందిన ఎంపీలు కూడా అందుకున్నారు. 
 
ఇదే అంశంపై మురళీమోహన్ మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదా రావడం కష్టంగా ఉందన్నారు. పలువురు కేంద్ర మంత్రులు ఇది సాధ్యం అయ్యేలా లేదని చెబుతున్నారని గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాలకు కూడా ఇవ్వవలసి వస్తుంది. అందువల్ల పరోక్ష సాయం చేస్తామని మంత్రులు చెబుతున్నారని మురళీమోహన్ స్పష్టం చేశారు. మొత్తం మీద కేంద్రంపై దీని గురించి ఆశలు వదలుకున్నట్లే కనిపిస్తోంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments