నేను 5కేజీలు తగ్గాలనుకుంటున్నా.. దీక్షకు రెడీ- ఉక్కు దీక్షా- డైట్ దీక్షా (Video)

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో,

Webdunia
శుక్రవారం, 29 జూన్ 2018 (12:28 IST)
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌  ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ సీఎం రమేష్‌కు గురువారం సాయంత్రం ఫోన్ చేశారు. ఆమరణ దీక్ష విరమించాలని ఆయన కోరారు. 
 
ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి ఆ క్రెడిట్ కేంద్రమే తీసుకోవాలని, తమకెలాంటి క్రెడిట్ అవసరం లేదని కేంద్రమంత్రికి రమేష్ తెలిపారు. రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే తన డెడ్ బాడీని చూస్తారని బీరేంద్ర సింగ్‌తో రమేష్ వ్యాఖ్యానించారు. 
 
సీఎం రమేష్ దీక్షకు పలువురు నేతలు మద్దతిస్తున్నారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉధృతంగా పోరు సాగుతోంది. వామపక్షాలు, వైకాపా శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో దీక్ష పట్ల ప్రస్తుతం ఢిల్లీలో టీడీపీ ఎంపీలు చేసిన సంభాషణ వైరల్‌గా మారింది. 
 
మురళీ మోహన్, జెసీ దివాకర్ రెడ్డి, అవంతి శ్రీనివాస్, మాగుంట బాబు, కేశినేని నాని, రాంమోహన్ నాయుడు, బుట్టా రేణుక తదితరులు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్రను కలిసేందకు వెళ్లారు. ఆ తర్వాత వీరంతా ఒక్కచోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. 
 
ఈ సందర్భంగా నిరాహార దీక్షపై కూడా కొందరు సెటైర్లు వేశారు. ఎంపీ మురళీ మోహన్.. తాను 5 కేజీలు వరకు తగ్గాలని అనుకుంటున్నానని, వారం రోజుల వరకు దీక్ష చేస్తానని అన్నారు. దీనిపై స్పందిచిన జేసీ దివాకర్ రెడ్డి, ఒకే డన్ అని అన్నారు. ప్రస్తుతం మురళీ మోహన్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా.. ఇది ఉక్కు దీక్షా లేకుంటే డైట్ దీక్షా అంటూ ప్రశ్నిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

Adivi Sesh: అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఉగాదికి ఫిక్స్

తల్లి చనిపోయినా తిరువీర్ చెప్పకుండా షూటింగ్‌లో చేశాడు : కరుణ కుమార్

ఓ.. చెలియా లోని నాకోసం ఆ వెన్నెల.. బాణీ ఎంతో హాయిగా ఉంది : జేడీ చక్రవర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments