Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబూ... నువ్వు మామను చెప్పుతో కొట్టిన శాడిస్టువి... ఎవరు...?

సిఎం చంద్రబాబుపై కాపు నేత ముద్రగడ పద్మనాభం రెచ్చిపోయారు. బూతులు మాట్లాడనంటూనే అంతకు రెట్టింపుగా బాబుపై విమర్శలు చేశారు. ఒకసారి రెండుసార్లు కాదు ఏకంగా మూడు పేజీల లేఖను బాబుకు పంపించి తిట్టని తిట్టు తిట

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (11:00 IST)
సిఎం చంద్రబాబుపై కాపు నేత ముద్రగడ పద్మనాభం రెచ్చిపోయారు. బూతులు మాట్లాడనంటూనే అంతకు రెట్టింపుగా బాబుపై విమర్శలు చేశారు. ఒకసారి రెండుసార్లు కాదు ఏకంగా మూడు పేజీల లేఖను బాబుకు పంపించి తిట్టని తిట్టు తిట్టకుండా ఆ లేఖలో రాశారు. అసలెందుకు ముద్రగడ ఆ లేఖను రాశారో తెలుసా..
 
కాపులను బిసిల్లో చేర్చాలన్న డిమాండ్‌తో ముద్రగడ పద్మనాభం గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అది కూడా తీవ్రస్థాయిలోనే. ఒకసారి విధ్వంసకర వాతావారణం, మరోసారి ఆందోళన. ఇలా ఒకటేమిటి ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి చేసేందుకు ప్రయత్నించారు ముద్రగడ. కాపులకు స్థానం కల్పించాలని, వారిని బిసిల్లో చేర్చాలన్నదే ముద్రగడ ప్రధాన డిమాండ్.
 
ఇదంతా బాగానే ఉన్నా ముద్రగడ నిన్న ముఖ్యమంత్రికి రాసిన లేఖ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన తరువాత చంద్రబాబు పార్టీలోకి వెళ్ళడం ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడం, అంతేకాదు చెప్పులతో తారక రామారావును కొట్టించడం.. ఎన్నో హామీలు ఇచ్చి మాట తప్పడం, కోట్ల రూపాయల అక్రమార్జన సంపాదించడం..ఇలా ఒకటేమిటి...ఎన్నో ఆరోపణలు చేస్తూ మూడు పేజీల లేఖను బాబుపై సంధించారు. 
 
ఈ లేఖ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఈ లేఖను చూసిన కాపులే ముద్రగడ తీరుపై మండిపడుతున్నారు. సమస్యను సానుకూలంగా అధిగమించాలే తప్ప అనవసరంగా వ్యక్తిగత విమర్శలకు దిగడం మంచిది కాదంటున్నారు కాపు నేతలు. ముద్రగడ రాసిన లేఖ టిడిపి నేతల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఈ లేఖపై ముద్రగడ బాబుకు క్షమాపణ చెబుతారా.. లేక టిడిపి నేతల ఆగ్రహాన్ని చవిచూస్తారా అన్నది వేచి చూడాల్సిందే.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments