జగన్‌కి పొగరెక్కువ.. మనిషికి పొగరు ఎంత ఉండాలో అంతే ఉండాలి: జేసీ
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి పొగరెక్కువని.. మనిషికి పొగరెంత ఉండాలో అంతే ఉండాలని.. అతిగా ఉంటే మాత్రం ప్రమాదమేనని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అందుకే తాను వైకాపాలో చేరలేదని.. ఎన్నికలకు ముందు తా
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి పొగరెక్కువని.. మనిషికి పొగరెంత ఉండాలో అంతే ఉండాలని.. అతిగా ఉంటే మాత్రం ప్రమాదమేనని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అందుకే తాను వైకాపాలో చేరలేదని.. ఎన్నికలకు ముందు తాను టీడీపీలో చేరానని తెలిపారు. ఎంపీగా గెలవడం కోసం టీడీపీలో చేరలేదన్నారు.
పనిలో పనిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును జేసీ కొనియాడారు. హంద్రీనీవా ద్వారా 2018-19 నాటికి అనంతపురంలోని అన్ని గ్రామాలకు నీరు తప్పకుండా అందిస్తారని ఆశిస్తున్నట్టు వెల్లడించారు.
సీమ రైతులకు సాగునీరిస్తే 2019లోనూ చంద్రబాబునాయుడే సీఎం అవుతారని అన్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం జేసీ మాట్లాడుతూ.. రైతుల పరిస్థితిని అర్థం చేసుకున్న నాయకుడు చంద్రబాబేనని ప్రశంసించారు. సీమకు సాగు నీరివ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని కొనియాడారు